పెళ్ళికి ముందు తర్వాత (మొగుడు ప్రివ్యూ)

By Srikanya

కృష్ణవంశీ, గోపీచంద్ ల కాంబినేషన్ లో తొలిసారిగా రూపొందిన మొగడు చిత్రం ఈ రోజు(శుక్రవారం)విడుదల అవుతోంది. కథలో.. ఆంజనేయ ప్రసాద్(రాజేంద్రప్రసాద్)గారాల తనయుడు రాం ప్రసాద్(గోపీచంద్). ఇంట్లో అందరూ బుజ్జీ అని ప్రేమగా పిలుచుకంటారు. ఆంజనేయ ప్రసాద్ కి అనుబంధాలు, ఆప్యాయతలపై నమ్మకం ఎక్కువ. అందరూ కలసి మలిసి ఉండాలనుకుంటాడు. అలాంటి ఇంటినుంచే ఓ అమ్మాయిని కోజలిగా తీసుకురావాలనేది ఆయన ఆలోచన. అందుకు తగిన సంభంధాన్నే చూస్తాడు. అఖిలాండేశ్వరి(రోజా)కుమార్తె రాజ రాజేశ్వరి(తాప్సీ)తో పెళ్లి కుదురుతుంది. ఈ పెళ్లికు ముందు, ఆ తర్వాత జరగిన సంఘటనలతో అల్లుకున్న కథ ఇది. మధ్యలో శ్రద్దాదాస్ పాత్ర ఏమిటి.. బుజ్జితో ఆ పాత్రకు ఉన్న సంభంధం ఏమిటనేది ఆసక్తికరమైన అంశం. నిర్మాత మాట్లాడుతూ.. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన ఘట్టం. మూడు ముళ్లతో పెనవేసుకునే ఓ ఆత్మీయ బంధం. ఉమ్మడి కుటుంబంలోని అనుబంధాలను చూపిస్తున్నాం. గోపీచంద్, తాప్సీల నటన ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. రాజేంద్రప్రసాద్ పాత్ర కీలకం అన్నారు.బలమైన కుటుంబం మరియు మానవ సంబంధాల నేపధ్యంతో సాగే ఈ చిత్రం ప్రేక్షకుల మనసుకు వెంటనే హత్తుకు పోతుందని గోపీచంద్ అన్నారు.

సంస్ద: లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్
నటీనటులు: గోపీచంద్, తాప్సీ, శ్రద్దాదాస్, రాజేంద్రప్రసాద్, రోజా, నరేష్, గీతాంజలి, మహర్షి రాఘవ తదితరులు
నిర్మాత: నల్లమలుపు శ్రీనివాస్
కెమెరా: శ్రీకాంత్
దర్శకత్వం: కృష్ణవంశీ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X