గోపీచంద్, నయనతార చిత్రం విశేషాలు

By Bojja Kumar

హీరో గోపీచంద్ హీరోగా, నిర్మాత తాండ్ర రమేష్ జయ బాలాజీ రియల్ మీడియా పతాకంపైన కొమర వెంకటేష్ సమర్పణలో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రంలో కథానాయికగా సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతారను ఎంపిక చేశారు. ఫస్ట్ టైమ్ గోపీచంద్-నయనతారల కలయికలో రూపుదిద్దుకోబోతున్న క్రేజీ చిత్రమిది. చిత్ర సమర్పకులు కొమర వెంకటేష్ తమ తాజా చిత్రం విశేషాలను తెలుపుతూ - 'గోపీ చంద్ హీరోగా మేము నిర్మిస్తున్న తాజా చిత్రం మార్చి 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నయనతారను హీరోయిన్ గా ఎంపిక చేశాం. ఈ చిత్రంలో యాక్షన్ కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, ఎంటర్ టైన్మెంట్ కూడా పార్లల్ గా సాగుతుంది. అన్ని తరగతుల ప్రేక్షకులను అలరించే రీతిలో దర్శకుడు ఈ కథను తీర్చి దిద్దారు. ఫస్ట్ టైం గోపీచంద్ తో కలిసి నయనతార నటిస్తున్న ఈ చిత్రానికిగాను సంగీత దర్శకుడు తమన్ చాలా మంచి ట్యూన్స్ ని సిద్ధం చేశాడు. ఏప్రిల్ మొదటి వారంలో పాటల్ని రికార్డింగ్ చేయడం జరుగుతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏప్రిల్ 9 వరకు మొదటి షెడ్యూల్ జరుగుతుంది. తిరిగి ఏప్రిల్ 25 నుంచి మొదలయ్యే రెండో షెడ్యూల్ కంటిన్యూగా కొనసాగుతుంది. జూన్ నెలలో ఫారిన్‌లో పాటలను చిత్రీకరిస్తాము' అన్నారు.

గోపీచంద్, నయనతార, అశుతోష్ రాణా, కోట శ్రీనివాసరావు, షాయాజీ షిండే, నాజర్, రఘుబాబు, టార్జాన్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్న ఈచిత్రానికి సంగీతం : తమన్ , మాటలు ఎం. రత్నం, ఛాయా గ్రహణం : శక్తి శరవణన్, ఆర్ట్ : కార్తీక్ రాజ్ కుమార్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రొడక్షన్ : బండి శేషయ్య, సమర్పణ : కొమర వెంకటేష, నిర్మాత : తాండ్ర రమేష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : జి. భూపతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X