గోపీచంద్ 'శంఖం'పూరిస్తాడా?

ఇక గతంలో గోపీచంద్-శివ కాంబబినేషన్ లో ఇటీవల హిట్ చిత్రం 'శౌర్యం' రూపొందిందన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రాన్ని బాలాజీ సినీ మీడియా బ్యానర్ పై జె.భగవాన్, జి.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా నిర్మాణం జరుపుకొంటున్న ఈ చిత్రంలో గోపీచంద్ కు జోడిగా త్రిష నటిస్తోంది.
ఇటీవల ఆస్ట్రేలియాలోని పాటల చిత్రీకరణ జరిపుకున్న ఈ చిత్రం నెలాఖరుకు షూటింగ్ పూర్తి చేయాలనే పట్టుదలతో దర్శకనిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో గోపీచంద్ కు తండ్రిగా తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఇతర పాత్రల్లో చంద్రమోహన్, ధర్మవరపు, ఆలి, వేణుమాధవ్, ఎం.ఎస్.నారాయణ, ఎల్.బి.శ్రీరామ్, ఆహుతి ప్రసాద్, బెనర్జీ, సీత తదితరులు నటిస్తున్నారు. బెట్టీ సినిమాటోగ్రఫీ, తమన్ సంగీతం అందిస్తున్నారు.
gopichand sankham siva souryam bhagavan pullarao trisha australia satyaraj చంద్రమోహన్ ధర్మవరపు గోపీచంద్ శివ త్రిష


Click it and Unblock the Notifications