'ఊసరవిల్లి' నిర్మాతతో గోపీచంద్ ఖరారు

By Srikanya

ఎన్టీఆర్ తో ఊసరవెల్లి చిత్రం నిర్మించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ తో ఖరారు అయ్యింది. ఈ చిత్రాన్ని దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్ డైరక్ట్ చేయనున్నారు. గతంలో గోపిచంద్,ఏలేటి చంద్రశేఖర్ కాంబినేషన్ లో ఒక్కడున్నాడు చిత్రం రూపొందింది.కానీ వర్కవుట్ కాలేదు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై రూపొందింనున్న ఈ చిత్రం గురించి నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ...''గోపీచంద్‌, ఏలేటి చంద్రశేఖర్‌ల కాంబినేషన్‌లో ఓ వెరైటీ కమర్షియల్‌ ఫిలిమ్‌ని నవంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌తో ప్రారంభిస్తున్నాం. సబ్జెక్ట్‌ చాలా బాగుంది.. డెఫినెట్‌గా ఈ కాంబినేషన్‌లో చాలా మంచి హిట్‌ సినిమా అవుతుంది. త్వరలోనే మిగిలిన వివరాలు తెలియజేస్తాను'' అన్నారు.

ప్రసుత్తం గోపీచందర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న 'మొగుడు' చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే ఈ ప్రాజెక్ట్ లో నటించనున్నట్లు సమాచారం. ఏలేటి, గోపీచంద్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాకు అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఐతే, అనుకోకుండా ఒకరోజు వంటి చిత్రాల తరహాలో ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది.ఇక చాలా కాలంగా వెంకటష్ హీరోగా ఏలేటి చిత్రం చేయాలని తిరగారు.కానీ సురేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటంతో సినిమా ముందుకు వెళ్లలేదు.దాంతో యేలేటి ఈ చిత్రం చేయటానికి రెడీ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X