గోపీచంద్ కొత్త చిత్రం డీటేల్స్
మొగుడు సినిమాతో భారీ డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న గోపీ చంద్ తాజాగా మరొ కొత్త సినిమాకు కమిట్ అయ్యాడు. జై బాలాజీ మీడియా పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని భూపతి పాండ్యన్ దర్శకత్వంలో తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పేరు పెట్టని ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 19నుండి జరుగనుందని నిర్మాత తెలియజేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా, గోపీచంద్‌కు సూట్ అయ్యే కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, ఇందులో గోపీ చంద్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడని ఆయన తెలిపారు. త్వరలోనే హీరోయిన్ ఎంపిక జరుగుతుందన్నారు.
గతంలో గోపీచంద్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన 'గోలీమార్' చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. అయితే గోపీచంద్ పాత్ర పవర్ ఫుల్ గా ఉన్నప్పటికీ ఆ సినిమా ప్రేక్షకులను అలరించ లేక పోయింది. చాలా రోజులగా సరైన హిట్టులేని ఈ హీరో మరోసారి పోలీసాఫీసర్ పాత్రను నమ్ముకున్నాడు. మరి ఈ సారి ఏమేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.
కోట శ్రీనివాసరావు, రఘుబాబు, షాయాజీషిండే, నాజర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: యం.రత్నం, కెమెరా: శక్తి శరవణన్, సమర్పణ: కొమర వెంక కథ-వూస్కీన్‌ప్లే-దర్శకత్వం: భూపతి పాండ్యన్.


Click it and Unblock the Notifications











