twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్ళీ ఆ కాంబినేషన్ సెట్ అయింది.. మరో 'సాహసం' చేస్తారా?

    |

    Recommended Video

    Gopichand & BVSN Prasad's SVCC 26th Film Shoot Started || స్పీడ్ పెంచిన గోపీచంద్

    లక్ష్యం, శౌర్యం, శంఖం, లౌక్యం లాంటి సినిమాలతో హిట్ కొట్టిన హీరో గోపిచంద్. ఈయన కెరీర్లో ఒక్కడున్నాడు, సాహసం లాంటి విభిన్న చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే గతకొంత కాలంగా సరైన విజయం లభించక.. ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఈయన కట్ ఔట్ కి అసలు సిసలైన హిట్ పడి చాలా కాలం అవుతోంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా హిట్టు కొట్టేందుకు ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. వివరాల్లోకి వెళితే..

    వరుస పరాజయలతో వెనకపడ్డ యాక్షన్ హీరో..

    వరుస పరాజయలతో వెనకపడ్డ యాక్షన్ హీరో..

    గౌతమ్ నందా, ఆక్సిజన్, పంతం లాంటి చిత్రాలు చేసినా గోపిచంద్ కు ఏ ఒక్కటి కలిసి రాలేదు. ఇక మళ్ళీ తనకు అలవాటైన యాక్షన్ చిత్రాలను ఎంచుకుంటున్నాడు. చాణక్య అంటూ త్వరలోనే మనముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్, టీజర్ ఆకట్టుకున్నాయి.

    సాహసం కాంబినేషన్ సెట్ అయింది..

    సాహసం కాంబినేషన్ సెట్ అయింది..

    ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా.. గోపిచంద్ హీరోగా వచ్చిన సాహసం చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నిధిని అన్వేషించుకుంటూ వెళ్లిన హీరో.. చేసిన సాహస విన్యాసాలను అద్బుతoగా ఆకట్టుకోవడంతో సూపర్ హిట్ గా నిల్చింది. అయితే ఇన్నేళ్ల తరువాత మళ్ళీ ఏ కాంబినేషన్ సెట్ అయింది.

     యాక్షన్ అడ్వెంచర్ గా రాబోతున్న సినిమా..

    యాక్షన్ అడ్వెంచర్ గా రాబోతున్న సినిమా..

    నూతన దర్శకుడు బిను సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కించనున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సతీష్ కురూప్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయినట్లు నిర్మాత తెలిపారు. మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

     దసరా బరిలో గోపిచంద్

    దసరా బరిలో గోపిచంద్

    ఇక చాణక్య సినిమాతో గోపిచంద్ దసరా బరిలో దూకేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్, బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

    English summary
    Gopichand new movie shooting started. Which is produced by bvsn prasad under svcc banner. Directed by debutant bini subramanyam and music composed by mani sharma.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X