గోపీచంద్: ఒకే సినిమా..రెండు ఓపినింగ్స్
హైదరాబాద్ : గోపిచంద్, నయనతార కాంబినేషన్ లో ఓ చిత్రం ఆ మధ్యన ప్రారంభమైన సంగతి తెలిసిందే. జగన్ మోహన్ ఐపియస్ టైటిల్ తో ఈ చిత్రాన్ని భూపతి పాండ్యన్ అనే తమిళ దర్శకుడుతో ప్రారంభించారు. ముహూర్తం ఘనంగా చేసి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసారు. అయితే అనుకోని విధంగా ఇప్పుడా దర్సకుడు తొలిగింపబడ్డాడు. తమిళ,తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ పోలీస్ కథకు ఇప్పుడు దర్శకుడు రూపంలో ఓ కొత్త ట్విస్ట్ వచ్చి పడింది. లక్ష్యం దర్శకుడు శ్రీవాస్ రంగంలోకి వచ్చారు. ఈ మేరకు వారు కొత్తగా ప్రకటన మీడియాకు విడుదల చేసారు.
ఆ ప్రకటనలో...గోపీచంద్ హీరోగా, 'లక్ష్యం' దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో జయబాలాజీ రియల్ మీడియా సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. నయనతార కథానాయిక. కొమర వెంకటేశ్ సమర్పణలో తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ 'గోపీచంద్‌గారితో 'లక్ష్యం' వంటి విజయవంతమైన చిత్రాన్ని తీసిన శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమా తీస్తున్నాం అని తెలియచేసారు.
దర్శకుడు చెప్పిన ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ విని గోపీచంద్ వెంటనే ఓకే చేశారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఆగస్టు ప్రథమార్థంలో పాటలను రికార్డ్ చేసి, ఆ వెంటనే షూటింగ్ ప్రారంభిస్తాం. నాన్‌స్టాప్‌గా జరిగే సింగిల్ షెడ్యూల్‌లో సినిమాని పూర్తి చేస్తాం' అని తెలిపారు. మిగిలిన తారాగణం ఎంపిక జరుగుతున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, సమర్పణ: కొమర వెంకటేశ్, నిర్మాత: తాండ్ర రమేష్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీవాస్.


Click it and Unblock the Notifications











