Pakka Commercial Twitter Review: గోపీచంద్ మూవీకి అలాంటి టాక్.. ప్లస్ మైనస్ ఇవే.. ఫైనల్ రిపోర్ట్ ఇలా
హీరోగా పరిచయమై చాలా కాలమే అవుతోన్నా భారీ సక్సెస్‌ను మాత్రం అందుకోలేక ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు మ్యాచో స్టార్ గోపీచంద్. కెరీర్ ఆరంభం నుంచి కొన్ని విజయాలను అందుకున్నా.. వాటిని భారీ స్థాయిలో మలుచుకోలేకపోయాడు. అయినప్పటికీ ప్రయత్నాలను మాత్రం ఆపకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ, ఈ మధ్య కాలంలో అతడికి అంతగా కలిసి రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ టాల్ హీరో 'పక్కా కమర్షియల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చింది? ట్విట్టర్‌లో నెటిజన్లు ఈ మూవీ గురించి ఏం మాట్లాడుతున్నారు? అనే విషయాలను చూద్దాం పదండి!
Recommended Video


పక్కా కమర్షియల్‌గా గోపీచంద్
గోపీచంద్ హీరోగా స్టార్ డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన చిత్రమే ‘పక్కా కమర్షియల్'. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జాక్స్ బెజాయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో సత్యరాజ్, రావు రమేష్ సహా పలువురు ప్రముఖులు కీలక పాత్రలను చేశారు.

అలాంటి కథ.. అంచనాలతోనే
‘పక్కా కమర్షియల్' మూవీ పక్కా కమర్షియల్ అయిన ఓ లాయర్ గురించి చెప్పే కథ అని ప్రచార చిత్రాలు చూస్తే అర్థం అయింది. ఈ చిత్రాన్ని మారుతి తన స్టైల్‌లో కామెడీ, యాక్షన్ మిక్స్ చేసి తెరకెక్కించాడు. ఇక, ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్లకు భారీ రెస్పాన్స్ రావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఫలితంగా ఈ సినిమా కోసం అందరూ వేచి చూస్తున్నారు.

బిజినెస్ తగ్గట్లుగానే విడుదల
గోపీచంద్ ‘పక్కా కమర్షియల్' మూవీ నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 7.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి రూ. 15.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది.

గోపీచంద్ మూవీకి టాక్ ఇలా
గోపీచంద్ - రాశీ ఖన్నా జంటగా నటించిన ‘పక్కా కమర్షియల్' మూవీ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్ సహా ఇండియాలోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు ఊహించని విధంగా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇది బాగుందని కొందరు, పర్వాలేదని ఇంకొందరు చెప్తున్నారు.

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ ఇలా
‘పక్కా కమర్షియల్' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి చాలా సమయం తీసుకున్నాడట దర్శకుడు మారుతి. పాత్రలను పరిచయం చేయడం.. లవ్ ట్రాక్ చూపించడానికే ఎక్కువ సమయం పట్టిందట. అయితే, సెకెండాఫ్ మాత్రం మిస్టరీ కేసును చేదించే సీన్లతో కాసింత ఉత్కంఠభరితంగా సాగుతుందని అంటున్నారు.

సినిమా ప్లస్... మైనస్‌లు ఇవే
‘పక్కా కమర్షియల్' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో గోపీచంద్, రాశీ ఖన్నా సహా కొందరు నటుల యాక్టింగ్ ఇరగదీసేశారట. అలాగే, బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు ప్లస్ అంటున్నారు. అయితే, కామెడీ పేలకపోవడం, థ్రిల్ మిస్ అవడం, లాజిక్ లేని సీన్లు ఈ సినిమాకు మైనస్‌గా మారాయని చెప్తున్నారు.

మొత్తంగా మూవీ ఎలా ఉంది
తాజా సమాచారం ప్రకారం.. గోపీచంద్ నటించిన ‘పక్కా కమర్షియల్' మూవీ కామెడీతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. గోపీచంద్ మార్కు యాక్షన్‌తో పాటు మారుతి రేంజ్ కామెడీని ఇందులో చూపించే ప్రయత్నం చేశారట. కానీ, అది పెద్దగా వర్కౌట్ కానట్లు ట్వీట్లను బట్టి చూస్తే అర్థం అవుతోంది. అయితే, ఇది అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే సినిమానే అని టాక్.


Click it and Unblock the Notifications











