గోపీచంద్ పంతం టీజర్ విడుదల తేది ఖరారు!
'ఆంధ్రుడు, యజ్ఞం, లక్ష్యం, శౌర్యం, లౌక్యం' వంటి సూపర్‌డూపర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తోన్న చిత్రం 'పంతం'. నూతన దర్శకుడు చక్రి ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నాడు. గోపీచంద్ కెరీర్‌లో లాండ్ మార్క్ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతోంది.
జూన్ 5న ఉదయం 11 గంటలకు పంతం సినిమా టీజర్ ను విడుదల చెయ్యబోతున్నారు. గోపీచంద్ సెంటిమెంట్, టైటిల్ చివరన సున్నాని కూడా 'పంతం' సాటిస్ఫై చెయ్యడంతో ఈ టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. గోపీచంద్ సరసన మెహరిన్ ఈ సినిమాలో నటిస్తోంది.

గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కె.కె.రాధామోహన్ నిర్మిస్తుండగా, ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ ఎన్ఆర్ ఐ పాత్రలో కనిపించబోతున్నాడు. జూలై 5వ తేదీన విడుదలకానున్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











