హీరోగా నా రేంజిని పెంచే చిత్రం..గోపీచంద్
హీరోగా నా రేంజ్‌ని పెంచే చిత్రంగా 'గోలీమార్' వుంటుంది' అంటున్నారు గోపీచంద్. ఆయన తాజా చిత్రం 'గోలీమార్' షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... " పూరి జగన్నాథ్ చెప్పిన కథ నన్ను ఎంతో ఇన్‌స్పైర్ చేసింది. ఇలాంటి అగ్ర దర్శకుడితో సినిమా చేయడం హ్యాపీగా వుంది " అన్నారు. గోపీచంద్, ప్రియమణి జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నగోపీచంద్‌పై చిత్రీకరించిన ముహుర్తపు దృశ్యానికి పూరి జగన్నాథ్ సతీమణి లావణ్య కెమెరా స్విఛాన్ చేయగా, బెల్లంకొండ సురేష్ సతీమణి పద్మావతి క్లాప్ నిచ్చారు.
ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ" ఇది ఓ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు కథ. సరికొత్త కథనంతో చిత్రం ఆసక్తిగా వుంటుంది. గోపీచంద్ కెరీర్‌లో ఓ వైవిధ్యమైన చిత్రంగా వుంటుంది. ఈ చిత్రంలో గోపీచంద్‌ను ఓ కొత్త యాంగిల్‌లో చూస్తారు' అన్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ" ఈ నెల 21 నుంచి మార్చి నెలాఖరు వరకు జరిగే ఒకే షెడ్యూల్‌తో చిత్రాన్ని పూర్తిచేసి వేసవి కానుకగా సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేస్తాం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్ర కథకు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్‌ను ప్రేరణగా తీసుకుని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లోకల్ ఇన్సిడెంట్స్‌ని జత చేసి ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం' అని చెప్పారు.
నాజర్, రోజా, షావర్ అలీ, పశుపతి, ఎం.ఎస్.నారాయణ, అలీ, జీవా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: శ్యామ్.కె.నాయుడు, సంగీతం: చక్రి, ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్, సమర్పణ: బెల్లంకొండ పద్మావతి, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











