గోపీచంద్‌కు మత్తుమందు పెట్టిన హీరోయిన్..!?
'యజ్ఞం"చిత్ర దర్శకుడు రవికుమార్ దర్శకత్వంలో 'నచ్చావులే" చిత్రంలోని తనీష్ హీరోగా పోకూరి బాబురావు నిర్మించిన చిత్రం 'ఏం పిల్లో ఏం పిల్లడో". గత రెండు రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం ద్వారా ప్రణీత హీరోయిన్ గా పరిచమైంది. ఇక ఈ చిత్రం షూటింగ్‌లో వుండగానే 'భావ" చిత్రంలో సిద్దార్థ సరసన నటించే ఛాన్స్ సంపాదించిన ప్రణీత....సినిమా రిలీజ్ తర్వాత గోపీచంద్ నటించే తాజా చిత్రంలో కూడా ఛాన్స్ కొట్టడానికి రెడీగా వుంది. అసలు విషయం ఏమిటంటే...'ఏం పిల్లో ఏం పిల్లడో" సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్రణీతను ఎక్కువ చూపించారు దర్శకనిర్మాత. ప్రణీత కూడా తన అందాలతో పాటు నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. కాగా బివియస్ రవిదర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ లో హీరో గోపీచంద్ తన తదుపరి చిత్రంలో హీరోయిన్‌గా ప్రణీత అయితే బావుంటుందని భావించి ఈ అమ్మడిని రికమండ్ చేసాడట. అదండి సంగతి తన అందాలతో పోస్టర్స్‌కి ఎక్కిన ప్రణీత ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించడమే కాకుండా తన వాలుకనుల చూపుతో గోపీచంద్‌కు కూడా మత్తుమందు పెట్టినటుంది కదూ...!


Click it and Unblock the Notifications











