గోపీచంద్ 'జిల్' చిత్రం ఫస్ట్ లుక్(పోస్టర్)

By Srikanya

హైదరాబాద: యు.వీ క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ హీరోగా గా మిర్చి చిత్రాన్ని నిర్మించిన వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ తాజాగా గోపీచంద్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రాశిఖన్నా హారోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా చంద్రశేఖర్ ఏలేటి వద్ద సహాయదర్శకుడిగా పనిచేసిన రాధాకృష్ణకుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. న్యూ ఇయిర్ సందర్భంగా ఈ చిత్రానికి 'జిల్' అనే టైటిల్ ని ఖరారు చేసి చిత్రం ఫస్ట్ లుక్ ని వదిలారు. మీరు ఇక్కడ చూస్తున్నదే ఈ ఫస్ట్ లుక్.

https://www.facebook.com/TeluguFilmibeat

గత చిత్రాలకు పూర్తి భిన్నంగా గోపీచంద్ స్టెలిష్ లుక్‌తో కనిపించబోతన్నట్టు చిత్ర వర్గాల సమాచారం. హీరో గోపీచంద్ కూడా ఈ చిత్రంపై ఆసక్తిగా వున్నట్లు తెలిసింది. ఇందులో గోపీచంద్ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుందని, ఆయన కెరీర్‌లో వైవిధ్యమైన చిత్రమవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కమర్షియల్ హంగులతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎనభై శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది.

Gopichand's 'Jil' First Look

పూర్తి కమర్షియల్ హంగులతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉండబోతోందని దర్శకుడు చెప్తున్నారు. రన్ రాజా రన్ చిత్రానికి సూపర్ హిట్ సంగీతం అందించిన ఘిబ్రాన్ ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకత్వం చేస్తున్నారు.

చిత్రంలో చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబీ అంజలి, కల్పలత, మౌళిక తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కాస్ట్యూబ్ డిజైనర్: తోట విజయభాస్కర్, ఆర్ట్ : డైరెక్టర్: ఎఎస్ ప్రకాష్, యాక్షన్: అనల్ అరసు, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, శక్తి శరవణన్, మ్యూజిక్: ఘిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.అశోక్ కుమార్ రాజు, ఎన్.సందీప్, ప్రొడ్యూసర్స్: వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, స్టోరీ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X