ఫైర్ ఆఫీసర్ ప్రేమ కథ( 'జిల్' ప్రివ్యూ)
హైదరాబాద్ : యాక్షన్ హీరోగా ముందుకెళ్తున్న గోపీచంద్ ఆ మధ్య కాలం వరకూ హిట్ అనేది దూరమైంది. లౌక్యంతో దారిలో పడ్డ గోపిచంద్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటేనే మారుతున్న ప్రేక్షకులు ఆదరిస్తారని అర్దం చేసుకున్నారు. అందులో భాగంగా ఓ కొత్త దర్శకుడుని పరిచయం చేస్తూ కొత్త ఆలోచనలతో కొత్త గెటప్ తో దిగుతున్నారు.
చిత్రంలో గోపిచంద్ ఓ ఫైర్ ఆఫీసర్. ఉవ్వెత్తున ఎగసే అగ్నిగోళాలు అతనికి పరిచయమే. పైకి నవ్వుతూ కనిపించినా అతనిలోనూ ఫైర్ ఉంది. అది ఎప్పుడు ఎలా ఎవరికి చూపించాడో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇందులో హీరోయిన్ పాత్ర పేరు సావిత్రి. ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంటుంది. చాలా బబ్లీగా, ఎనర్జిటిక్‌గా, వైవిధ్యంగా ఉండే పాత్ర అది. ఈ చిత్రంలో ఆమె వ్యావహారిక శైలి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆమె కేరక్టర్‌ని పర్టిక్యులర్‌గా ఉండేటట్టు తీర్చిదిద్దాడు మా దర్శకుడు. ఉద్వేగానికి గురైనప్పుడు జుట్టును నోటి దగ్గరకు తెచ్చుకుని లాగుతూ ఉంటుంది. పాత్ర పరంగా ట్రెడిషినల్‌గా కనిపించినా, పాటల్లో పూర్తి గ్లామర్‌గా కనిపించి అలరిస్తుంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ''మా సంస్థలో నేనూ కొత్త దర్శకుల్ని పరిచయం చేశాను. ఇప్పుడు యూవీ క్రియేషన్స్ కొత్తవాళ్లతో సినిమాలు చేస్తూ విజయాల్ని అందుకొంటోంది. ఈ చిత్రంలో గోపీచంద్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడ''న్నారు.

''జిబ్రాన్ సంగీతం ఈ తరానికి నచ్చేలా ఉంది. కొత్త ఆలోచనతో 'జిల్'రూపొందించాం. అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంద''న్నారు దర్శకుడు.
''రాధాకృష్ణ ఏడాదిన్నర కష్టపడి ఈ కథ తయారు చేశాడు. సినిమా చూశాను చాలా బాగా వచ్చింది. రాశీ ఖన్నా ఇది వరకటి సినిమాలకంటే 'జిల్'లో మరింత అందంగా కనిపించింది. భవిష్యత్తులో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకొంటుంద''న్నారు గోపీచంద్. ఈ సినిమాతో తనకు మరింత పేరొస్తుందని రాశీ ఖన్నా ఆశాభావం వ్యక్తం చేసింది.
బ్యానర్ :యూవీ క్రియేషన్స్
నటీనటులు:గోపీచంత్, రాశీ ఖన్నా , చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబీ అంజలి, కల్పలత, మౌళిక తదితరులు
కాస్ట్యూమ్ డిజైనర్: తోట విజయభాస్కర్,
ఆర్ట్ : డైరెక్టర్: ఎఎస్ ప్రకాష్,
యాక్షన్: అనల్ అరసు,
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు,
డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, శక్తి శరవణన్,
మ్యూజిక్: ఘిబ్రాన్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.అశోక్ కుమార్ రాజు, ఎన్.సందీప్,
ప్రొడ్యూసర్స్: వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి,
స్టోరీ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్
విడుదల తేదీ : మార్చి 27,2015.


Click it and Unblock the Notifications











