ఫ్యామిలీతో చూడొచ్చు: గోపీచంద్ ‘లౌక్యం’ సెన్సార్ రిపోర్ట్

By Bojja Kumar

హైదరాబాద్: గోపీచంద్ ,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ''లౌక్యం ''. తాజాగా ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే ఫ్యామిలీతో కలిసి చిన్నపిల్లలు కూడా ఈ సినిమా చూడొచ్చు అని సర్టిఫైడ్ చేసిందన్నమాట.

ఇటీవల ఈ చిత్రం ఆడియో వేడుక విజయవాడలో నిర్వహించారు. ఆడియో సీడీని గోపీచంద్ ఆవిష్కరించగా, వి.ఆనంద్‌ప్రసాద్ తొలి కాపీ అందుకున్నారు. థియేటర్ ట్రైలర్లను ఆర్.నారాయణమూర్తి విడుదల చేశారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ- కథ వినగానే తనకు బాగా నచ్చిందని, చంద్రమోహన్, బ్రహ్మానందల జోడీ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు. తొలి సన్నివేశం నుండి చివరి సన్నివేశం వరకు కామెడీతో సాగే ఈ చిత్రం విందుభోజనంలా ఉంటుందని, అందరికీ నచ్చుతుందని ఆయన తెలిపారు.

Gopichand's Loukyam Movie Censor Report

మంచి కథ, కథనాలతో సాగే ఈ చిత్రంలో డైలాగులు పేలతాయని, లక్ష్యం ఎంత హిట్ అయిందో ఈ సినిమా కూడా అంత విజయవంతం అవుతుందని దర్శకుడు శ్రీవాస్ తెలిపారు. రచయిత కోన వెకంట్ మాట్లాడుతూ...ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి మైల్ స్టోన్ అవుతుంది. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గా మారాను. అత్తారింటికి దారేది సినిమా చూసినప్పుడు నాకు ఏదైతే ఎనర్జీ వచ్చిందో ఈ సినిమా చూసినప్పుడు అదే ఫీలింగ్ కలిగింది. శ్రీధర్ సీపాన మంచి కథను అందించారు. బెస్ట్ ఆల్బమ్ అవుతుంది. సినిమా డెఫినెట్ గా చాలా పెద్ద హిట్టవుతుంది. గోపీచంద్ సౌమ్యుడు, మంచి బిహేవియర్ ఉన్న హీరో. శ్రీనివాస్ కి ఈ సినిమా పెద్ద డైరెక్టర్ గా నిలబెడుతుంది. ప్రతి ఆర్టిస్టు. టెక్నీషియన్ ఎంజాయ్ చేస్తూ చేసిన సఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుంది అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X