ఏప్రిల్ 11 న గోపీచంద్ కొత్త చిత్రం లాంచింగ్
హైదరాబాద్ : గోపీచంద్ హీరోగా భవ్య క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తారు. వి.ఆనంద్ ప్రసాద్ నిర్మాత. ప్రస్తుతం హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11 న లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తారు.
నిర్మాత మాట్లాడుతూ ''కథాబలం ఉన్న చిత్రమిది. గోపీచంద్ సినిమా అంటే.. ఎలాంటి అంశాలు ఉండాలని ఆశిస్తారో అవన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. అనూప్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పాటల రికార్డింగ్ ప్రారంభించాం. 'శౌర్యం' తరవాత గోపీచంద్ చేస్తున్న పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది'' అన్నారు.
దర్సకుడు శ్రీవాస్ మాట్లాడుతూ...''లక్ష్యంతో నా కెరీర్ ప్రారంభమైంది. దర్శకుడిగా నన్ను ప్రోత్సహించిన.. గోపీచంద్‌తో మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. తప్పకుండా అంచనాలను అందుకొనేలా ఉంటుందీ చిత్రం'' అన్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీధర్ సీపాన, స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీమోహన్.
ప్రస్తుతం గోపీచంద్..బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో చేస్తున్నారు. ఈ చిత్రంలో గోపీచంద్..పోరాట వీరుడుగా కనిపించనున్నారని చెప్తున్నారు. ''ఓ వీరుడి పోరాటం... ఈ చిత్రం. అతని ప్రయాణం ఎందుకోసమో తెరపై చూస్తే తెలుస్తుంది. ఈ యాక్షన్ చిత్రంలో ప్రేమ భావనలకూ చోటుంది. గోపీచంద్, నయనతార జంట ఆకట్టుకొంటుంది''అని దర్శకుడు చెప్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది.

ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ''యాక్షన్, వినోదం మేళవింపుతో తెరకెక్కుతున్న చిత్రమిది. 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'ఇంద్ర' లాంటి చిత్రాల్ని రూపొందించిన బి.గోపాల్ ఈసారి గోపీచంద్‌ని ఓ కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పాటల్ని విదేశాల్లో చిత్రీకరిస్తాం. గోపీచంద్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా చిత్రం తయారవుతుంది. రిలీజ్,ఆడియో వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తాము''అన్నారు.
తెలుగులో అగ్రహీరోలందరితో పనిచేసిన సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనుండటంతో ప్రాజెక్టుపై క్రేజ్ ఏర్పడుతోంది. గోపీచంద్, గోపాల్ తొలి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మాస్‌ని, క్లాస్‌ని ఆకట్టుకునే విధంగా ఉండనుంది. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా ఉండే కథను ఎన్నుకుని గోపాల్ ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. కెమెరా: బాలమురుగన్.


Click it and Unblock the Notifications











