గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ ఇదేనా?
హైదరాబాద్: యు.వీ క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ కథానాయకుడిగా మిర్చి చిత్రాన్ని నిర్మించిన వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ తాజాగా గోపీచంద్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రాశిఖన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా చంద్రశేఖర్ ఏలేటి వద్ద సహాయదర్శకుడిగా పనిచేసిన రాధాకృష్ణకుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి ‘జిల్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అఫీషియల్ సమాచారం వెలువడే అవకాశం ఉంది. ఘిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
గోపీచంద్ ప్రస్తుతం పుత్రోత్సాహంలో ఉన్నాడు. ఆయన భార్య రేష్మ సోమవారం(అక్టోబర్ 13) హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. చాలా కాలంగా సరైన హిట్టులేని గోపీచంద్ లౌక్యం చిత్రం విజయంతో చాలా సంతోషంగా ఉన్నారు. ఇపుడు తాను కోరుకున్న విధంగా...మగ బిడ్డ పుట్టడంతో తన తండ్రే మళ్లీ మా ఇంట్లో పుట్టాడని సంతోష పడుతున్నాడు గోపీచంద్.

రేష్మకు ఇటీవలే శ్రీమంతం జరిగింది. రేష్మకు సంబంధించిన ఆరోగ్య విషయాలు, గర్భంతో ఉన్న ఆమెను మరింత సంతోషంగా ఉంచడానికి గోపీచంద్ గత కొన్ని రోజులుగా పెటర్నటీ లీవు(పితృత్వపు సెలవు)లో ఉన్నారు. హీరో గోపీచంద్ వివాహం రేష్మాతో హైదరాబాద్‌లోని ఎన్.కన్వెన్షన్ సెంటర్‌లో మే 12, 2013న వైభవంగా జరిగింది.
బిడ్డ పుట్టిన విషయం తెలియడంతో తెలుగు సినీ పరిశ్రమలోని పలువురు గోపీచంద్ కు శుభాకాంక్షలు తెలియజేసారు. ఆయన సన్నిహితులు కొందరు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి అభినందించారు. బిడ్డ పుట్టిన ఆనందాన్ని త్వరలో వేడుకగా చేసేందుకు గోపీచంద్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











