గోపీచంద్ ‘పంతం’ ఫస్ట్ లుక్ లీక్
టాలీవుడ్లో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం 'పంతం' అనే చిత్రంలో నటిస్తున్నారు. 'ఫర్ ఎ కాజ్' అనేది సబ్ టైటిల్. కెరీర్లో 25వ చిత్రం కావడంతో గోపీచంద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. ఫస్ట్ లుక్ మార్చి 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే అంతలోనే ఇంటర్నెట్, సోషల్ మీడియాలో పోస్టర్ లీకైంది.
గతంలో పవర్, జై లవకుశ చిత్రాలకు రచయితగా పని చేసిన కె చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకుడు పరిచయం అవుతున్నాడు. గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరయిన్. ఇందులో ఆమె స్కూల్ టీచర్ పాత్రలో కనిపించబోతోంది.

ఇంకా పృధ్వి, జయప్రకాష్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్లో కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. మే 18న సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











