twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిట్ కోసమే ‘సాహసం' (ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం చిత్రాలు యేలేటి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనాలు. ఆ చిత్రాలతో ఆయనకు తనకంటూ అభిమానులను తయారు చేసుకున్నారు. అలాగే గోపీచంద్ కు మాస్ లోమంచి ఇమేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్ అంటే ఎప్పుడూ ఆసక్తే. తాజాగా ఆయన గోపీచంద్ హీరోగా 'సాహసం' చిత్రాన్ని రూపొందించి ఈ రోజు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

    గౌతమ్‌ వర్మ (గోపీచంద్‌) ఓ సెక్యురిటీ గార్డ్‌. జీతం తక్కువ. కానీ ఖరీదైన కలలు కంటుంటాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావాలని ఆశ. లాటరీలు కొనడం హాబీ. అనుకోకుండా ఓసారి తన పూర్వీకుల గురించి తెలుస్తుంది. వాళ్లకు సంబంధించిన ఆస్తులు ఓ చోట నిక్షిప్తమై ఉంటాయి. అయితే ఆ చోటుకి చేరుకోవడం తేలికైన విషయం కాదు. అందుకోసం గౌతమ్‌ ఎన్ని సాహసాలు చేశాడనేదే ఈ చిత్ర కథ. మరోవైపు శ్రీనిధి (తాప్సి)కి దైవభక్తి ఎక్కువ. ఈ ప్రపంచం అంతమైపోతుందని నమ్ముతూ, ఈలోగా జీవితాన్ని ఆనందంగా గడిపేయాలి అనుకొంటుంది. విరుద్ధ భావాలు కలిగిన వీరిద్దరూ ఎలా ప్రయాణం సాగించారు అనేది ఆసక్తిరం.

    దర్శకుడు మాట్లాడుతూ ''నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇప్పటి వరకూ ప్రయోగాత్మక చిత్రాలు చేశా. తొలిసారి కథానాయకుడి ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకొని తయారు చేసిన కథ. వాణిజ్య అంశాలన్నీ ఉంటాయి. సినిమా ఓ ఫజిల్‌లాగా అనిపిస్తుంది. తరవాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలుగుతుంది. లడక్‌లో తీసిన యాక్షన్‌ సన్నివేశాలు తప్పకుండా ఆకట్టుకొంటాయి. పతాక సన్నివేశాల్లో నలభై నిమిషాల పాటు సాగే విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రత్యేక ఆకర్షణ''అన్నారు.

    హీరో గోపీచంద్ మాట్లాడుతూ..''చందు కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యాను. డబ్బు మనిషిని శాసిస్తున్న అంశం. ఈ కథ కూడా దాని చుట్టూనే తిరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కథతో తేలిగ్గా ప్రయాణం చేయగలుగుతారు. కథ విని ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. కచ్ఛితంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది భిన్నమైన కథ. సమాజంలో మనిషికీ, మనీకీ మధ్య చాలా లింకు ఉంది. అందుకే ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది'' అని చెప్పారు.

    నిర్మాత మాట్లాడుతూ- ''ఒక చిన్న పిల్లకాలువలా ఈ కథ మొదలవుతుంది. పోను పోను మహాసముద్రంగా మారుతుంది. ఊహకందని రీతిలో కథ, కథనాలు సాగుతాయి. ఓ సెక్యూరిటీ గార్డ్ జీవితంలోని ఆసక్తికరమైన మలుపులే ఈ సినిమా. నిధి నేపథ్యంలో సాగే అడ్వంచరస్ మూవీ ఇది. చంద్రశేఖర్ ఏలేటి ఎంతో ప్రతిష్టాత్మంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా చంద్రశేఖర్ శైలిలో ఈ సినిమా ఉంటుంది. శ్రీ స్వరాలందించిన ఈ చిత్రం పాటలు ఇప్పటికే శ్రోతలను అలరిస్తున్నాయి. శ్రీ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. గోపిచంద్‌కి కచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్నిస్తుంది'' అని నమ్మకం వ్యక్తం చేశారు.

    సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి.
    నటీనటులు: గోపీచంద్‌, తాప్సి, శక్తికపూర్‌, అలీ తదితరులు.
    సంగీతం: శ్రీ
    మాటలు: కె.కె.రాధాకృష్ణకుమార్,
    కెమెరా: శ్యామ్‌దత్ ఎస్.,
    ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు,
    కళ: ఎస్.రామకృష్ణ,
    పాటలు: అనంత శ్రీరామ్,
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్,
    సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు,
    సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్ మెంట్స్.
    నిర్మాత: బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌
    దర్శకత్వం: చంద్రశేఖర్‌ యేలేటి
    విడుదల: 12,జూలై 2013 (శుక్రవారం).

    English summary
    Chandrasekhar Yeleti has carved a name for himself with films such as Aithe, Anukokonda Oka Roju besides making commercial entertainers like Okkudunnadu and Prayanam. One can expect something different from this dynamic director. His latest film Sahasam is releasing today (July 12)."Sahasam" is an adventure flick which has Gopichand playing the role of an ATM guard in search of his family's treasure in Pakistan. Taapsee Pannu plays the female lead who falls in love with the hero and joins him in the treasure hunt. Bollywood actor Shakti Kapoor has a significant role in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X