twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోపీచంద్ ‘సాహసం’ రిలీజ్ డేట్ ఖరారు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై గోపీచంద్ హీరోగా, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందిన 'సాహసం' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. జూన్ 21న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యజ్ఞం, రణం, లక్ష్యం, శౌర్యం వంటి చిత్రాలలో నటించిన గోపీచంద్..... ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన చంద్రశేఖర్ ఏలేటి తొలి కలయికలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టెన్మెంట్ సమర్పణలో ఛత్రపతి ప్రసాద్ నిర్మించారు.

    ఈ సందర్భంగా నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ...'సాహసం చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేస్తున్నాం. ఆడియో సూపర్ హిట్టయింది. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా చంద్రశేఖర్ బాణీలో ఉంటూనే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందిందని, ఇంతవరకూ ఎవరూ షూటింగ్ చేయని ప్రదేశాలలో ఈ షూటింగ్ చేశామని, తమ సంస్థకు ఓ మంచి విజయవంతమైన చిత్రంగా మారే ఈ సినిమా గోపీచంద్‌కు ల్యాండ్‌మార్క్ మూవీగా ఉంటుందని' తెలిపారు.

    గోపీచంద్ సరసన తాప్సీ హీరోయిన్. శక్తికపూర్, అలీతోపాటుగా ప్రముఖ తారాగణమంతా నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: శ్యామ్‌దత్ ఎస్, సంగీతం: శ్రీ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: సెల్వ, మాటలు: కె.కె.రాధాకృష్ణకుమార్, పాటలు: అనంత్‌శ్రీరామ్, సహ నిర్మాత: బోగవల్లి బాపినీడు, నిర్మాత: ఛత్రపతి ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర్ ఏలేటి.

    English summary
    Gopichand, Tapsi starrer 'Sahasam' releasing on June 21. The movie directed by Chandrasekhar Yeleti, BVSN Prasad produce this film on Sri Venkateswara Cine Chitra banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X