గోపీచంద్‌కు భారీ షాక్: రిలీజ్ రోజే ‘సీటీమార్’ మొత్తం లీక్.. ఆ సైట్లలో మూవీ డౌన్‌లోడ్ లింక్

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతోన్నా.. భారీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు మాచో హీరో గోపీచంద్. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను తన ఖాతాలో వేసుకున్నప్పటికీ.. కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా ఓ సక్సెస్‌ను అందుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్' అనే సినిమాలో నటించాడు. ఇది శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్‌ను అందుకుంది. కానీ, అంతలోనే గోపీచంద్ నటించిన ఈ చిత్రం ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చింది. ఆ సంగతులు మీకోసం!

‘సీటీమార్' అంటూ వచ్చిన గోపీచంద్

‘సీటీమార్' అంటూ వచ్చిన గోపీచంద్

గోపీచంద్, తమన్నా కాంబోలో సంపత్ నంది తెరకెక్కించిన చిత్రం 'సీటీమార్'. దీనిని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి నిర్మించారు. భూమిక చావ్లా ఇందులో కీలక పాత్రను పోషించింది. అలాగే, ఇందులో అప్సరా రాణి ఓ స్పెషల్ సాంగ్‌ను చేసింది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.

 అన్నింటికీ భారీ రెస్పాన్స్... అంచనాలు

అన్నింటికీ భారీ రెస్పాన్స్... అంచనాలు

చాలా కాలంగా వరుస పరాజయాలను చవి చూస్తోన్న గోపీచంద్ నటించిన తాజా చిత్రం 'సీటీమార్'. ఈ మూవీలో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని అతడు చూస్తున్నాడు. ఇక, ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ మాస్ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే వచ్చాయి.

గోపీచంద్ కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్

గోపీచంద్ కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్

సుదీర్ఘ కాలంగా హీరోగా కొనసాగుతోన్నా గోపీచంద్‌కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. దీంతో అతడి సినిమాలకు ఓ మోస్తరుగానే బిజినెస్ జరుగుతుంది. కానీ, 'సీటీమార్'కు మాత్రం ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 13 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం కూడా అన్ని ప్రాంతాల్లో పండుగ రోజున గ్రాండ్‌గా విడుదల అయింది.

పాజిటివ్ టాక్‌.. కమ్‌బ్యాక్ మూవీ అంటూ

పాజిటివ్ టాక్‌.. కమ్‌బ్యాక్ మూవీ అంటూ

గోపీచంద్ నటించిన 'సీటీమార్' మూవీ ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి అన్ని ప్రాంతాల్లోనూ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా పాజిటివ్ టాక్‌తో ఈ మూవీ సత్తా చాటింది. ఇక, ఇది గోపీచంద్‌కు పర్‌ఫెక్ట్ కమ్‌బ్యాక్ మూవీ అని అంటున్నారు. ఈ చిత్ర విజయంపై యూనిట్‌తో పాటు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

విడుదల రోజే ‘సీటీమార్' మొత్తం లీక్

విడుదల రోజే ‘సీటీమార్' మొత్తం లీక్

ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమ ఎన్నో ఒడిదుడుకుల మధ్య నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పైరసీ భూతం ఇండస్ట్రీని మరింతగా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన గోపీచంద్ 'సీటీమార్' మూవీ కూడా విడుదలైన రోజే లీకైపోయింది. ఈ సినిమా డౌన్‌లోడ్ లింక్స్ కూడా ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం అవడంతో భారీ షాక్ తగిలినట్లైంది.

Recommended Video

Seetimaarr Movie Team Vinayaka Chaviti Special Interview
ఆ సైట్లలో ‘సీటీమార్' డౌన్‌లోడ్ లింక్

ఆ సైట్లలో ‘సీటీమార్' డౌన్‌లోడ్ లింక్

చాలా కాలంగా పైరసీని ప్రోత్సహిస్తోన్న తమిళ్ రాకర్స్, మూవీ రూల్జ్ వంటి సంస్థలు ఎన్నో చిత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 'సీటీమార్' మూవీని కూడా లీక్ చేసేశాయి. ఇందులో భాగంగానే డౌన్‌లోడ్ లింక్‌ను కూడా పెట్టేశాయి. దీని ప్రభావం సినిమా కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో చూపించే ప్రమాదం కూడా ఉంది. దీంతో యూనిట్ ఆందోళన చెందుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X