Seetimaarr​ Twitter Review: గోపీచంద్ చాలా రోజుల తర్వాత.. హైలైట్ అదే.. మొత్తంగా ఎలా ఉందంటే!

కెరీర్ ఆరంభంలోనే సక్సెస్‌లను అందుకున్నా.. చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు మాచో స్టార్ గోపీచంద్. ఇలాంటి పరిస్థితుల్లో అతడు విజయం కోసం సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కానీ, అన్ని సార్లూ ప్రతికూల ఫలితాలే వచ్చాయి. దీంతో పంథాను సైతం మార్చుకుని పలు ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించాడు. కానీ, విజయం మాత్రం వరించలేదు. ఈ క్రమంలోనే ఈ టాలెంటెడ్ హీరో చేసిన చిత్రమే 'సీటీమార్'. గోపీచంద్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫస్ట్ రివ్యూ మీ అందరి కోసం!

 ‘సీటీమార్' కొట్టించేందుకు రెడీ

‘సీటీమార్' కొట్టించేందుకు రెడీ

గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది తెరకెక్కించిన చిత్రం 'సీటీమార్'. ఈ మూవీని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. భూమిక చావ్లా ఇందులో కీలక పాత్రను పోషించింది. అలాగే, ఇందులో అప్సరా రాణి ఓ స్పెషల్ సాంగ్‌ను చేసింది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది.

 తొలిసారి అలా... భారీ అంచనాలు

తొలిసారి అలా... భారీ అంచనాలు

చాలా కాలంగా విజయం కోసం వేచి చూస్తోన్న గోపీచంద్ ఎంతో పట్టుదలతో నటించిన చిత్రమే 'సీటీమార్'. ఈ మూవీలో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని అతడు చూస్తున్నాడు. ఇక, ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్‌ ఏర్పడిన విషయం తెలిసిందే.

రికార్డు స్థాయిలో సినిమా బిజినెస్

రికార్డు స్థాయిలో సినిమా బిజినెస్

మిగిలిన టైర్ టూ హీరోలతో పోలిస్తే గోపీచంద్‌కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. దీంతో అతడి సినిమాలకు ఓ మోస్తరుగానే బిజినెస్ జరుగుతుంది. కానీ, 'సీటీమార్'కు మాత్రం ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 13 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం కూడా అన్ని ప్రాంతాల్లో పండుగ రోజున గ్రాండ్‌గా విడుదల అవుతుంది.

రామ్ చరణ్ చేతికి విలువైన వాచ్: దాని ధర ఎంతో తెలిస్తే నిద్ర కూడా పట్టదు.. ఇది కూడా రికార్డే!
https://telugu.filmibeat.com/hero/mega-power-star-ram-charan-weared-rs-1-crore-rm-watch-102615.html

అందరి కోరిక.. పాజిటివ్ టాక్‌తోనే

అందరి కోరిక.. పాజిటివ్ టాక్‌తోనే

టాలీవుడ్‌లో ప్రతి ఒక్క హీరోకూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే, అందరు హీరోలు మాత్రం గోపీచంద్ సినిమాలను ఆదరిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'సీటీమార్' మూవీ సూపర్ హిట్ అవ్వాలని వాళ్లంతా కోరకుంటున్నారు. ఇక, ఇప్పటికే ఓవర్సీస్‌లో ఈ సినిమా పలు ప్రాంతాల్లో ప్రదర్శితమైందని తెలుస్తోంది. అక్కడ పాజిటివ్ టాక్ వచ్చినట్లు రిపోర్టులు వస్తున్నాయి.

గోపీచంద్.. చాలా కాలం తర్వాత

గోపీచంద్.. చాలా కాలం తర్వాత

ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. 'సీటీమార్' మూవీ అన్ని వర్గాలను ఆకట్టుకునే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ అని తెలుస్తోంది. ఇందులో కుటుంబం అంతా చూసే అంశాలే ఎక్కువగా ఉన్నాయని వీక్షకులు అంటున్నారు. మొత్తంగా దీనితో మాచో హీరో గోపీచంద్ చాలా కాలం తర్వాత ఓ భారీ హిట్ కొట్టాడని ఈ సినిమాను చూసిన వాళ్లంతా చెబుతున్నారు.

 ‘సీటీమార్' హైలైట్లు ఇవేనంటూ

‘సీటీమార్' హైలైట్లు ఇవేనంటూ

ఓవర్సీస్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే 'సీటీమార్' మూవీకి సంబంధించిన షోలు పడ్డాయి. అక్కడ ఈ సినిమాను వీక్షించిన వాళ్లు చెప్పిన దాని ప్రకారం.. ఇందులో గోపీచంద్ నటన, మణిశర్మ సంగీతం, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్, యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా ఉన్నాయట. అయితే, ఎమోషనల్ సీన్స్ పెద్దగా పండలేదని, కొన్ని సీన్స్ బోరింగ్‌గా ఉన్నాయిని సమాచారం.

Recommended Video

Vijay Sethupathi తెలుగు బ్రాండ్ వాల్యూ పీక్స్.. | NBK పక్కన విలన్ గా నిజమే!! || Filmibeat Telugu
ఫస్టాఫ్, సెకెండాఫ్ ఎలా ఉందంటే

ఫస్టాఫ్, సెకెండాఫ్ ఎలా ఉందంటే

గోపీచంద్ నటించిన 'సీటీమార్' మూవీ ఫస్టాఫ్ మొత్తం కబడ్డీ గేమ్‌కు సంబంధించిన సీన్స్‌తో నడుస్తుందట. ఇంటర్వెల్ సమయంలో పెద్ద ట్విస్ట్‌తో కథలో వేగం పుంజుకుంటుందని తెలుస్తోంది. ఇక, సెకెండాఫ్‌లో వచ్చే కొన్ని ఎపిసోడ్స్ సీటీ కొట్టించే విధంగా ఉన్నాయట. మొత్తంగా ఈ సినిమా గోపీచంద్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉందన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X