»   » హీరో గోపీచంద్ కుమారుడి సెకండ్ బర్త్ డే ఫోటో...

హీరో గోపీచంద్ కుమారుడి సెకండ్ బర్త్ డే ఫోటో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు హీరో గోపీచంద్, రేష్మ దంపతుల ముద్దుల కుమారుడు విరాట్ కృష్ణ నేడు రెండో పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. గతేడాది సినీ ప్రముఖుల సమక్షంలో తన కుమారుడి మొదటి పుట్టినరోజును గ్రాండ్ గా జరిపిన గోపీచంద్... ఈ సారి మాత్రం అలాంటి హడావుడి చేయలేదు. కారణం ప్రస్తుతం గోపీచంద్ సినిమా షూటింగులో భాగంగా విదేశాల్లో ఉండటమే.

ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్ లో జరుగుతోంది. దీంతో కుమారుడి పుట్టినరోజు వేడుక ఇక్కడే సింపుల్ గా నిర్వహించారు. కుమారుడితో ఉన్న ఫోటోను గోపీచంద్ అభిమానులతో షేర్ చేసారు.

విరాట్ కృష్ణతో కలిసి గోపీచంద్

విరాట్ కృష్ణతో కలిసి గోపీచంద్

బ్యాంకాక్ లో తన ముద్దుల కుమారుడు విరాట్ కృష్ణ రెండో పుట్టినరోజు వేడుక సెలబ్రేట్ చేసిన హీరో గోపీచంద్.

ఫస్ట్ బర్త్ డే (ఓల్డ్ ఫోటో)

ఫస్ట్ బర్త్ డే (ఓల్డ్ ఫోటో)

గతేడాది సినీ ప్రముఖుల సమక్షంలో తన కుమారుడి మొదటి పుట్టినరోజును గ్రాండ్ గా జరిపిన గోపీచంద్ ఈ సారి సమయం కలిసి రాక పోవడంతో సింపుల్ గా చేయాల్సి వచ్చింది.

గోపీచంద్-రేష్మ

గోపీచంద్-రేష్మ

గోపీచంద్ ను వివాహమాడిన రేష్మ మరెవరినో కాదు... ప్రముఖ తెలుగు నటుడు శ్రీకాంత్ కు దగ్గరి బంధువే. 2013 లొ వీరి వివాహం జరిగింది.

సినిమాలు

సినిమాలు

2014 అక్టోబర్ 13న గోపీచంద్, రేష్మ దంపతులకు విరాట్ కృష్ణ జన్మించాడు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాత‌లుగా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ తెరకెక్కుతోది. గోపీచంద్ సరసన హన్సిక, క్యాథిరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

English summary
Gopichand son Virat Krishna Second Birthday Celebrated in Bangkok Shooting For Sampath Nandi New Movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu