అవునా?! గోపీచంద్ భార్య గురించి...ఇంట్రెస్టింగ్ న్యూస్
హైదరాబాద్ : తెలుగు హీరో గోపీచంద్ వివాహం రేష్మ అనే అమ్మాయితో ఈ నెల 12న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. మనో హీరో శ్రీకాంత్ బంధువే ఈ రేష్మ. సినీ పరిశ్రమలోని ప్రముఖులతో పాటు, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వీరి వివాహ మహోత్సవానికి హాజరై సందడి చేసారు.
ఇప్పటి వరకు రేష్మ అంటే...కేవలం శ్రీకాంత్ బంధువు అని మాత్రమే తెలుసు. అయితే ఆమె ప్రొఫెషన్ ఏమిటి? ఏం చదువుకుంది? పెళ్లి తర్వాత ఆమె ప్లాన్స్ ఏమిటి? హౌస్ వైఫ్‌గా ఉండిపోతుందా? తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా? అనే సందేశాలు చాలా మందిలో ఉన్నాయి.
ఈ సందేహాలకు సమాధానంగా తాజాగా ఫిల్మ్ నగర్లో రేష్మ గురించి ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. రేష్మ చాలా కాలం క్రితమే బీటెక్ పూర్తి చేసిందని, ఆ తర్వాత యానమినేషన్ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుందని తెలుస్తోంది. శ్రీకాంత్ బ్రదర్ మేక అనిల్ భాగస్వామిగా ఉన్న ఓ స్టూడియోలో ఆమె 3డి మాయా, ఇతర విజువల్ ఎఫెక్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుందట.
భవిష్యత్‌లో రేష్మ 'స్టేట్ ఆఫ్ ఆర్ట్స్ యానిమేషన్ స్టూడియో' ప్రారంభించాలనే ఆలోచనలో ఉందని, దీని ద్వారా కార్టూన్ ఫిల్మ్స్, 3డి యానిమనేషన్ షార్ట్ ఫిల్మ్ రూపొందించాలనే ప్లాన్లో ఉందట. మరి రేష్మ తన ఆలోచనలను ఏ మేరకు ఆచరణలో పెడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications












