గోపీచంద్ ‘సాహసం’విడుదల తేదీ
హైదరాబాద్ : గోపీచంద్ హీరోగా రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఛత్రపతి ప్రసాద్ నిర్మించిన 'సాహసం'. ఈ చిత్రం జూన్ 14న గ్రాండ్ మ్యానర్ లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
తాప్సీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం గూర్చి నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ షూటింగ్ మొత్తం పూర్తిచేసి, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని, నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అరగంట నుంచి 45 నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఉంటాయి.
హీరో దేనికోసం వెళ్లాడు, అది తీసుకురావడానికి ఎలా కృషి చేశాడు అని చెప్పే క్రమంలో కొంత సీజీ వర్క్‌ను పెట్టాల్సి వచ్చింది అని దర్శకుడు చెప్పారు. అలాగే ఉత్తరాదినే ఎక్కువ భాగాన్ని చిత్రీకరించారు.
గోపీచంద్ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి కలయికలో వస్తున్న అడ్వెంచరస్ ఎంటర్‌టైనర్ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందిందని, ఏ తెలుగు సినిమా షూటింగ్ చేయని, సరికొత్త ప్రాంతాలలో ఈ సినిమాను నిర్మించామని, గోపీచంద్‌కు తప్పక ఓ హిట్ సినిమాగా మారుతుందని, అలాగే తమ సంస్థకు మంచి పేరు చిత్రం తెస్తుందని తెలిపారు.
శక్తికపూర్, అలీతోపాటు ప్రముఖ తారాగణమంతా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.శ్యామ్‌దత్, సంగీతం: శ్రీ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: కె.కె.రాధాకృష్ణకుమార్, పాటలు: అనంత్‌శ్రీరామ్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర్ ఏలేటి.


Click it and Unblock the Notifications












