twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోపీచంద్ ‘సాహసం’ చిత్ర కథ ఏంటి

    By Srikanya
    |

    హైదరాబాద్ : తనకు ఎలాంటి అస్తిపాస్తులు లేవని భావించే ఓ సాధారణ సెక్యూరిటీ గార్డుకు అనుకోని సంఘటనల కారణంగా తనకూ ఆస్తి వుందని తెలుస్తుంది. దాన్ని దక్కించుకోవడం కోసం ఓ ప్రదేశానికి వెళతాడు. అప్పుడు ఏం జరిగిందన్నదే 'సాహసం' చిత్ర కథ. ఓ వ్యక్తి వ్యక్తిగత కథ ఇది. తన ప్రయాణంలో నిధి అన్వేషణ అనేది ఓ భాగంలా వుంటుందే కానీ పూర్తిగా నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే కథ మాత్రం కాదు అంటున్నారు యేలేటి చంద్రశేఖర్.

    ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం చిత్రాలు యేలేటి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనాలు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ హీరోగా 'సాహసం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బి.వి. ఎస్.ఎన్‌పసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి మీడియాతో మాట్లాడారు.

    అలాగే యాక్షన్ హీరోగా గోపీచంద్‌కు ఓ ఇమేజ్ వుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా ఇది. దాదాపు ఆరేళ్ల విరామం తరువాత మా ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా ఇది. ఈ తరహా కథని ఇంతకు ముందు గోపీచంద్ చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే అతనికీ నాకూ ఇది కొత్త కథ. అడ్వంచరస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. కథ రాస్తున్నప్పుడే కొత్తగా అనిపించింది అన్నారు.

    ఇక ఈ చిత్ర కథకు స్ఫూర్తికలిగించిన అంశాలు గురించి చెప్పాలంటే.... ఇండియా-పాకిస్థాన్ విడిపోయిన సమయంలో ఇక్కడి వాళ్లు అక్కడికి వెళ్లారు. అక్కడి వాళ్లు కొంత మంది ఇక్కడికి వచ్చారు. ఈ క్రమంలో కొన్ని ఆస్తులను చాలా మంది వదులుకున్నారు. దీనిపై ఓ వార్తాపవూతికలో వచ్చిన కథనం నన్ను ఆకట్టుకుంది. దాని స్ఫూర్తితో 'సాహసం' చిత్ర కథకు నాందిపలికాను. చాలా రిస్క్ అనిపించినా లడక్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశాం అన్నారు.

    హీరో గోపీచంద్ మాట్లాడుతూ..''చందు కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యాను. డబ్బు మనిషిని శాసిస్తున్న అంశం. ఈ కథ కూడా దాని చుట్టూనే తిరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కథతో తేలిగ్గా ప్రయాణం చేయగలుగుతారు. కథ విని ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. కచ్ఛితంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది భిన్నమైన కథ. సమాజంలో మనిషికీ, మనీకీ మధ్య చాలా లింకు ఉంది. అందుకే ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది'' అని చెప్పారు.

    నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ- ''గోపీచంద్, చంద్రశేఖర్ ఏలేటిలతో సినిమా చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు కుదిరింది. చందు తయారు చేసిన స్క్రిప్ట్ గోపీచంద్‌కు చాలా బాగుంటుంది. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నాం'' అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ప్రశాంత్ అట్లూరి, సుమలత, కెమెరా: శామ్‌దత్, సంగీతం: శ్రీ, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్.

    English summary
    
 Gopichand's new film directed by Chandrashekar Yeleti is gearing for release. The yet untitled film is in the last leg of its shoot. Jackpot was the working title of this film. Now the makers and the film team are looking out for a good title for the film. We hear that the lead hero Gopichand is in favour of the title ' Sahasam'. This film is a treasure hunt film, with Tapsee as Gopichand's leading lady. BVSN Prasad is producing this film while Sri has scored the music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X