గోపీచంద్ శంఖం ఏమైంది?
గోపిచంద్, త్రిష కాంబినేషన్లో మొన్న శుక్రవారం రిలీజైన శంఖం సినిమా కలెక్షన్స్ అప్పుడే డ్రాప్ అవటం ప్రారంభమయ్యాయి. మాస్ హీరోగా అతని చేసిన విన్యాసాలు, త్రిష గ్లామర్, అలీ కామిడీ గా కూడా ఈ చిత్రాన్ని నిలబెట్టలేకపోతున్నాయి. శని, ఆదివారాలు వీకెండ్స్ కావటంతో చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. అయితే ఇప్పటికే చాలా సార్లు తెలుగు తెరపై వచ్చిన సన్నివేశాలు రిపీట్ కావటం, పాటలు సైతం వర్కవుట్ కాకపోవటం మైనస్ గా మారాయి. ముఖ్యంగా కథ, కథనాలు వీక్ గా ఉండటం, మాస్ ఆడియన్స్ ఆశించే పైట్స్ కిక్ ఇవ్వకపోవటంతో బి, సి సెంటర్లు సైతం అనుమానమేనని సిని వర్గాలు విశ్లేషిస్తున్నారు. దర్శకుడు శివ తన గత చిత్రం శౌర్యం లా కూడా దీనని తీర్చి దిద్దకపోవటం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఏదైనా పెద్ద చిత్రం అంటేనే ధియోటర్ల వైపుకు తొంగిచూడాలంటే భయంగా ఉందని సగటు ప్రేక్షకుడు వాపోతున్నాడనేది నిజం.


Click it and Unblock the Notifications











