మొగుడు సినిమాతో నాకల నెరవేరింది: గోపీచంద్
కృష్ణవంశీ సినిమా అంటే ఆర్టిస్టులు పడి చస్తారు. కృష్ణవంశీ సినిమాలో చేస్తే ఆ సినిమాలో చేసాం అనే సంతృప్తి మాత్రమే కాదు, ఇంకో పది సినిమా అవకాశాలు తెచ్చిపెడుతుంది. చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా బాగా ఎలివేట్ అవుతారు. అదే సంతృప్తిని ప్రేక్షకులకు అందించడంలో ఈ మద్య కృష్ణవంశీ ఫెయిల్ అవుతున్నాడు. అయితే మొగడుతో తన క్రేజ్ ను మళ్ళీ ఎలా తెచ్చుకుంటాడో చూడాల్సిందే.
కాగా కృష్ణవంశీ"తో పనిచేసేందుకు పదేళ్లుగా వేచి చూస్తున్నానని నటుడు గోపీచంద్ తెలిపారు. ఇంత కాలానికి నా నిరీక్షణ ఫలించిందన్నారు. 'తొలి వలపు" సినిమాతో తెలుగు సినిమా అరంగేట్రం చేసిన గోపీచంద్ తాను అవకాశం కోసం ఇద్దరు దర్శకులను మాత్రమే కలిసానన్నారు. అందులో ఒకరు కృష్ణవంశీ కాగా మరొకరు తేజ. తనకు తేజ 'జయం"అందించగా, కృష్ణవంశీ తో పని చేయటానికి పది సుదీర్ఘ సంవత్సరాలు హోల్డ్ లో ఉండాల్సి వచ్చిందన్నారు.
కృష్ణవంశీతో కలసి పనిచేయటంపై గోపిచంద్ ఇలా స్పందించారు. 'ఆయన ఒక సంస్థ. అతనితో పనిచేస్తున్నప్పుడు ఆర్జించే జ్ఞానం అపారం. దర్శకునిగానే కాక, సంగీతం, సాహిత్యం, పాటల చిత్రీకరణలో అతని ప్రతిభ చెప్పనలవి కాదు". 'మొగుడు" సినిమా గురించి మాట్లాడుతూ బలమైన కుటుంబం మరియు మానవ సంబంధాల నేపధ్యంతో సాగే ఈ చిత్రం ప్రేక్షకుల మనసుకు వెంటనే హత్తుకు పోతుందని అభిప్రాయపడ్డారు. అయితే…,"మొగుడు" సినిమా నవంబర్ 4 వ తేదీన విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











