ఒకే షెడ్యూల్‌లో మొత్తం.. గోపీచంద్ బర్త్ డేకు ‘సీటీమార్’ టీమ్ గిఫ్ట్

గోపీచంద్.. గత కొన్నేళ్లుగా విజయం కోసం పరితపిస్తున్నాడు. ఒక్క హిట్ కొట్టలేక ఎంతో సతమతమవుతున్నాడు. లౌక్యం సినిమా తరువాత ఒక్కటంటే ఒక్క హిట్ కూడా గోపీచంద్ ఖాతాలో పడలేదు. ఎన్నో మార్లు ప్రయత్నాలు చేసినా.. బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డాడు. ఎన్నో విభిన్న కథలను ట్రై చేసినా గానీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అయితే ఈ సారి మాత్రం ఎలాగైనా హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు.

పంతం, చాణక్య వంటి చిత్రాలు మంచి అంచనాలతో రిలీజైనా.. ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేదు. యథావిథిగా గోపీచంద్‌ను నిరాశ పరిచాయి. అయితే గౌతమ్‌నందా తెరకెక్కించిన సంపత్ నంది.. మళ్లీ గోపీచంద్‌తో సీటీమార్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అంతా బాగుండి ఉంటే ఈ పాటికే సీటీమార్ రిలీజ్ కావాల్సి ఉంది. కరోనా వైరస్ వచ్చి అంతా తారుమారు చేసింది. అయితే తెలంగాణలో షూటింగ్లకు అనుమతి మంజూరు చేయడంతో అందరిలో ఆశలు చిగురించాయి.

 Gopichand Seetimaarr Shooting starting from August 1st week

ఇప్పటికే అరవై శాతం పూర్తి చేసుకున్న సీటీమార్.. ఇక ఒకే షెడ్యూల్‌లో సినిమా మొత్తాన్ని పూర్తి చేయాలని భావిస్తోందట. ఈ మేరకు చిత్రయూనిట్ ఓ ప్రకటన చేస్తూ ఆగష్టు మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం అవుతుందని, ఇక ఒకే షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తామని తెలిపారు. రేపు గోపీచంద్ బర్త్ డే (జూన్ 12) సందర్భంగా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేస్తామని నిర్మాత శ్రీనివాస చిత్తూరి తెలిపారు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X