రేపే గోపీచంద్ 'శంఖం'
గోపీచంద్, త్రిష జంటగా శివ దర్శకత్వంలో శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'శంఖం' రేపు విడుదలకానుంది. భారీగా రూపొందిన ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత జె.భగవాన్ మాట్లాడుతూ "గోపీచంద్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిత్రంగా ఈ సినిమా మిగిలిపోతుందని" తెలిపారు. దర్శకుడు శివ మాట్లాడుతూ "ఈ తరం ప్రేక్షకులకు కావలసిన అంశాలన్నీ ఈ చిత్రంలో వున్నాయని, అన్ని కమర్షియల్ హంగులూ వున్న ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని" అన్నారు. 'వర్షం' చిత్రంలో నాయికాప్రతినాయకులుగా నటించి మెప్పించిన త్రిష, గోపీచంద్ నాయికానాయకులుగా కూడా బెస్టె పెయిర్ గా నిలబడతారని అంటున్నారు.
గమనిక: ఈ చిత్రం రివ్యూకై రేపు "దట్స్ తెలుగు"కు లాగిన్ అవ్వండి.
More from Filmibeat
shankam releasing tomorrow gopichand trisha shiva j bhagavan j pullareddy శంఖం రేపే విడుదల గోపీచంద్ త్రిష శివ జెభగవాన్ జెపుల్లారెడ్డి


Click it and Unblock the Notifications











