గోపీచంద్, శ్రీవాస్ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోలు)
హైదరాబాద్ : గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. వి.ఆనంద్ ప్రసాద్ నిర్మాత. రాకుల్ ప్రీత్ సింగ్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తారు. భవ్య క్రియేషన్స్ వారు ప్రొడక్షన్ నెం.5గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ ''కథాబలం ఉన్న చిత్రమిది. గోపీచంద్ సినిమా అంటే.. ఎలాంటి అంశాలు ఉండాలని ఆశిస్తారో అవన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. ఇప్పటికే పాటల రికార్డింగ్ ప్రారంభించాం. 'శౌర్యం' తరవాత గోపీచంద్ చేస్తున్న పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది'' అన్నారు.
దర్సకుడు శ్రీవాస్ మాట్లాడుతూ...''లక్ష్యంతో నా కెరీర్ ప్రారంభమైంది. దర్శకుడిగా నన్ను ప్రోత్సహించిన.. గోపీచంద్‌తో మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. తప్పకుండా అంచనాలను అందుకొనేలా ఉంటుందీ చిత్రం'' అన్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీధర్ సీపాన, స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీమోహన్....

ఫస్ట్ సీన్
హీరో గోపీచంద్, హీరోయిన్ రాకుల్ ప్రీత్ సింగ్ లపై చిత్రీకరిస్తున్న తొలి సన్నివేశానికి క్లాప్ కొడుతున్న దృశ్యం.

గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో 2వ సినిమా
‘శౌర్యం' తర్వాత గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న రెండవ సినిమా ఇది. భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది.

హీరో, దర్శకుడు, నిర్మాత
సినిమా ప్రారంభోత్సవం సందర్బంగా సినిమాకు విజయం చేకూరాలని వేది పండితలు ప్రత్యేక పూజలు చేసారు. పూజ అనంతరం హీరో, దర్శకుడు, నిర్మాత ఇలా దర్శన మిచ్చారు.

గోపీచంద్, రాకుల్ ప్రీత్ సింగ్
రాకుల్ ప్రీత్ సింగ్ ఇంతకు ముందు ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'లో నటించి నటన, గ్లామర్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











