చావు బతుకుల సమస్య అన్నట్టు పూరీ జగన్నాధ్...గోపీచంద్
కొత్తవారిలో దూకుడు ఎక్కువ. చాలా కసిగా చేస్తారు. తొలి సినిమా అంటే చావు బతుకుల సమస్య అన్నట్టు కష్టపడతారు. ఇవన్నీ ఇప్పటికీ పూరీ జగన్నాధ్ లో ఉన్నాయి. ఆయన కూడా తొలి సినిమా అన్నట్లే భావించి కష్టపడతారు. కాకపోతే కొత్తవాళ్లకు అనుభవం లేకపోవడం వల్ల ఎక్కడో ఒకచోట పొరపాటు చేసి దొరికిపోతారు. జగన్ అలా కాదు. ఓ అనుభవజ్ఞుడితో పని చేయడంలో ఎంత సౌలభ్యం ఉందో 'గోలీమార్'తో తెలిసింద అంటూ పూరీ జగన్నాధ్ వర్కింగ్ స్టైల్ గురించి చెప్పుకొచ్చారు గోపీచంద్. అలాగే...మొదట్లో జగన్ పెద్ద డైరెక్టర్...ఎలా వుంటుందో ఏమో...అని భయపడ్డాను. కాని సెట్‌లోకి వెళ్ళిన మొదటి రోజే ఆ భయం పోయింది. ఎందుకంటే ఎంతో ఫ్రెండ్లీగా వుండే వ్యక్తి జగన్ అని ఆ రోజే తెలిసింది.
పూరీ జగన్నాధ్ తో కలిసి పనిచేయడం ఎంతో కంఫర్టబుల్ గా వుంటుంది. ఇక ఈ చిత్రం అవకాశం ఎలా వచ్చిందో చెబుతూ...జగన్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇక జగన్ వచ్చి 'గోపి...మనమిద్దరం కలిసి ఓ సినిమా చేస్తున్నాం' అని చెప్పగానే నా ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే ఆయన దర్శకత్వంలో నేను సినిమా చేస్తానని ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకున్నాను. అప్పుడు కథంతా చూఛాయగా చెప్పారు. అప్పుడే నాకు నచ్చేసింది. షూటింగ్ మొదలయ్యే ఓ వారం ముందు డైలాగులతో సహా చెప్పారు. అప్పుడే ఈ సినిమా విజయాన్ని ఊహించుకున్నాను. 'గోలీమార్'లో జగనే కాదు..కథ కూడా ఉంది కాబట్టే జనానికి నచ్చింది.


Click it and Unblock the Notifications











