హీరో గోపీచంద్ తండ్రి కాబోతున్నాడోచ్!
హైదరాబాద్: ‘లౌక్యం' సినిమా బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు ఇవ్వడంతో సంతోషంగా ఉన్న గోపీచంద్...త్వరలో తండ్రి కాబోతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ భార్య రేష్మ గర్భవతిగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే మనం శుభవార్త వినబోతుండటం ఖాయంగా కనిపిస్తోంది.
హీరో గోపీచంద్ వివాహం రేష్మాతో హైదరాబాద్‌లోని ఎన్.కన్వెన్షన్ సెంటర్‌లో మే 12, 2013న వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. గోపీచంద్ పెళ్లాడిన రేష్మ ..హీరో శ్రీకాంత్ కు బంధువు.

రేష్మ గురించిన వివరాల్లోకి వెళితే...
రేష్మ బీటెక్ పూర్తి చేసిందని, ఆ తర్వాత యానమినేషన్ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుందని తెలుస్తోంది. శ్రీకాంత్ బ్రదర్ మేక అనిల్ భాగస్వామిగా ఉన్న ఓ స్టూడియోలో ఆమె 3డి మాయా, ఇతర విజువల్ ఎఫెక్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుందట. భవిష్యత్‌లో రేష్మ 'స్టేట్ ఆఫ్ ఆర్ట్స్ యానిమేషన్ స్టూడియో' ప్రారంభించాలనే ఆలోచనలో ఉందని, దీని ద్వారా కార్టూన్ ఫిల్మ్స్, 3డి యానిమనేషన్ షార్ట్ ఫిల్మ్ రూపొందించాలనే ప్లాన్లో ఉందట. మరి రేష్మ తన ఆలోచనలను ఏ మేరకు ఆచరణలో పెడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











