గోపీచంద్ తో త్రిష రొమాన్స్
వర్షం చిత్రంలో త్రిష వెనక పడి ఇబ్బంది పెట్టే విలన్ గోపీచంద్..ఇప్పుడు ఆమె కోసం హీరోగా మారి విలన్స్ ని ఎదురిస్తున్నాడు. 'శౌర్యం" ఫేమ్ శివ దర్శకత్వంలో శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్-జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న..ఇంకా పేరు పెట్టని చిత్రంలో ఈ విచిత్రం జరగబోతోంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన త్రిష హీరోయిన్ గా చేస్తోంది. కింగ్ తర్వాత త్రిష చేస్తున్న చిత్రం ఇదే. అలాగే శౌర్యం అనంతరం అదే దర్శకుడి చిత్రంలో గోపీచంద్ చేయటంతో మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడుతోంది.
గోపీచంద్, త్రిషలపై రెండు పాటలతోపాటు, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరణ కోసం ఈనెల 15న ఈ చిత్రయూనిట్ ఆస్ట్రేలియాకు వెళ్తోంది. ఆస్ట్రేలియా షెడ్యూల్ అనంతరం మే 10 నుంచి జూన్ నెలాఖరు వరకు నిరవధికంగా జరిగే చివరి షెడ్యూలతో సినిమా మొత్తం పూర్తవుతుంది. జూన్‌లో ఆడియో విడుదల చేసి, జులైలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలలో ఒకరైన జె.భగవాన్ చెబుతున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ కీలకపాత్ర పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











