గోపీచంద్ 'వాంటెడ్' ఆడియో విడుదల తేది ఫిక్స్
గోపీచంద్ తాజా చిత్రం 'వాంటెడ్' ఆడియో జనవరి రెండవ తేదీన విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు. ఇక రచయిత నుండి దర్శకుడుగా మారిన బి.వి.ఎస్.రవి 'వాంటెడ్' చిత్రాన్ని రూపొందించారు. అలాగే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రం కథ గురించి మాట్లాడుతూ దర్శకుడు బి.వి.ఎస్.రవి...కథలోని మలుపులు టెన్షన్ ని క్రియోట్ చేస్తాయి. 'వాంటెడ్' అనే పేరుకి మంచి స్పందన వస్తోంది. ఎవరు ఎవరికి కావాలో తెర మీదే చూడాలి. చక్రి అందించిన స్వరాలు ఆకట్టుకొంటాయి. ఇటీవలే ఇటలీలో మూడు పాటల్ని చిత్రీకరించాం అన్నారు.
ఈ చిత్రాన్ని గతంలో గోపీచంద్ తో శౌర్యం చిత్రం నిర్మించిన భవ్య క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ టైటిల్ విషయమై భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ...హీరోకి హీరోయిన్ వాండెట్. విలన్ కి హీరో వాంటెడ్. కాబట్టే స్క్రిప్టు ప్రకారం ఈ టైటిల్ యాప్ట్ అని తలిచాం అన్నారు ఇక దర్శకుడు బి.వియస్ రవి గతంలో కళ్యాణ రామ్ జయీభవ, విష్ణు వర్దన్ సలీం, ఝమ్మంది నాదం వంటి చిత్రాలకి కథ, మాటలు అందించారు. దీక్షాసేథ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నె రవి, కూర్పు: శంకర్, ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్, నిర్మాత: వెనిగళ్ల ఆనందప్రసాద్.


Click it and Unblock the Notifications











