హీరోయిన్ కి విలన్ వాంటెడ్-విలన్ కి హీరో వాంటెడ్...
బీవిఎస్ రవి దర్శకత్వంలో గోపిచంద్, దీక్షాసేథ్ జంటగా భవ్య క్రియేషన్స్ సంస్థ అధినేత వెనిగెళ్ళ ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'వాంటెడ్". మూడు పాటల మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఆ పాటల్ని ఇటలీలో చిత్రీకరణ జరపుకుంటుంది. ఈ సందర్భంగా దర్శకుడు రవి చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఇటలీలో చిత్రీకరించే మూడు పాటలతో షూటింగ్ పూర్తవుతుంది. నిక్సన్ నృత్యరీతుల్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రం లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్. గోపిచంద్ క్యారెక్టరైజేషన్ సరికొత్తగా ఉంటుంది. మాస్ తో పాటు అన్ని వాణిజ్య అంశాలన్నీ సమపాళ్ళలో మేళవించి, యూత్ ని కూడా ఆకట్టుకునే విధంగా ఈ పాత్రను తీర్చిదిద్దుతున్నామన్నారు. హీరో ఎవరినైనా వెతుకుతున్నాడా? లేదంటే హీరోను గురించి ఎవరైనా వెతుకుతున్నారా? అనేది ఆసక్తికరంగా ఉంటుందన్నారు.
నిర్మాత మాట్లాడుతూ..అన్ని కార్యక్రమాలను ముగించుకొని జనవరి ప్రథమార్థంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమా చాలా కొత్తగా, స్టైలిష్ గా ఉంటుంది. ఇందులో హీరోకి హీరోయిన్ వాంటెడ్, హీరోయిన్ కి విలన్ వాంటెడ్, విలన్ కి హీరో వాంటెడ్. అందుకే ఈ సినిమాకి 'వాంటెడ్" అనే టైటిల్ పెట్టాం. టైటిల్ కి మంచి స్పందన వస్తుందన్నారు...


Click it and Unblock the Notifications











