ఆ డైరక్టర్స్ తో ఎప్పుడంటే అప్పుడే...గోపీచంద్
వినాయక్, రాజమౌళి..వాళ్ళు ఎప్పుడు పిలిచినా వాళ్ళతో పనిచేయడానికి నేను సిద్ధమే. అలాగే జగన్‌తో మళ్ళీ చేయాలని ఉంది. తనతో పనిచేస్తుంటే హాయిగా, ఎలాంటి టెన్షన్ లేకుండా సాఫీగా సాగినట్టు అనిపించింది అంటున్నారు గోపీచంద్. గోపిచంద్ తాజా చిత్రం గోలీమార్ ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పై విధంగా చెప్పుకొచ్చారు. అంతేగాక తనకు ఎలాంటి కథ కావాలో చెపుతూ...గోపీచంద్ అంటే భారీ డైలాగులు, ఫైట్లు కావాలంటున్నారు. మంచి ప్రేమ కథతో ఎవరైనా ముందుకొస్తే నటించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. 'కలిసుందాం రా' వంటి చిత్రాన్ని చేయాలని నాక్కూడా ఎప్పటి నుంచో ఉంది. నా తొమ్మిదేళ్ళ కెరీర్‌లో యజ్ఞం, రణం, ఒక్కడున్నాడు, లక్ష్యం..అన్నింటిలోనూ ప్రేమ ఉంది. కాకపోతే యాక్షన్ మిళితమై ఉందన్నారు.


Click it and Unblock the Notifications











