»   » మహేష్ తో శ్రీనువైట్ల అనుకన్నది వేరు

మహేష్ తో శ్రీనువైట్ల అనుకన్నది వేరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు శ్రీనువైట్ల మొదట మహేష్ తో సినిమా అనుకోగానే ఆయన మనస్సులో ఉన్న ఓ ఎపిక్ స్టోరీని తెరకెక్కిద్దామని నిర్ణయించుకున్నారు.ఇప్పటివరకూ మహేష్ ని చూపించిన దానికన్నా చాలా ఢిఫెరెంట్ గా చూపించాలని ఆశపడ్డారు.అయితే ఎపిక్ స్టోరీ అంటే చాలా టైమ్ తీసుకుంటుంది,ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇబ్బంది అని నిర్మాతలు చెప్పటంతో ఈ దూకుడు కథకు వచ్చారని దూకుడు కధా రచయిత గోపీమోహన్ చెప్తున్నారు.అందులోనూ మహేష్ తో సినిమా అంటే చాలా లేటవుతోందని టాక్ ఉండటం ఆయన సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తూండటంతో త్వరగా చెయ్యాలని దూకుడుని చేపట్టారని వివరించారు.

ఇక దూకుడు కథ తయారైన విధానం గురించి చెపుతూ.. చిత్రం వర్క్ కరెక్టుగా చెప్పాలంటే డిసెంబర్ 2009 లో మొదలైంది.శ్రీను వైట్ల ఆ ప్రాజెక్టుని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కన్ఫర్మ్ చేసారు.ఆయనకు చాలా కాలం నుండి ఆ నిర్మాతలు స్నేహితులు.అప్పుడు రకరకాల లైన్స్ అనుకుని మా స్నేహితులతో చర్చించటం జరిగింది.గోవా వెళ్ళి ఓ లైన్ ఫైనలైజ్ చేసుకుని వచ్చాము.దాన్ని బేస్ చేసుకుని రొమాన్స్,కామిడీ వర్కవుట్ అయ్యేలా సీన్స్ ప్లాన్ చేసుకున్నాను. ఓ పాయింట్ దగ్గర ఫిక్స్ అయి శ్రీను వైట్ల కు వివరించాను అన్నారు.ఇక ఒక్కడ లాంటి యాక్షన్ సినిమా ఆల్రెడీ మహేష్ చెయ్యటం జరిగింది.కాబట్టి యాక్షన్ లవ్ స్టోరీ,ఎంటర్టైన్మెంట్ కలిపి చేద్దామని ఫిక్స్ అయి ఈ కథని అల్లటం జరిగిందని వివరించారు.

English summary
Sreenu Vaitla garu want to do something different and he want to show Mahesh Babu in an epic movie.He has one period subject in mind.And he narrated that line to me.I liked the concept but then i and our producers started thinking practically.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu