జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు: మొదలైన అనుమానాలు.. ఫ్యాన్స్‌లో అయోమయం!

నందమూరి తారక రామారావు మనవడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్, సింగింగ్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటి టీనేజ్‌లోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లను అందుకున్న అతడు.. మధ్యలో పరాజయాలు ఎదురైనా కృంగిపోకుండా ముందుకెళ్లాడు. దీంతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కి.. కొన్నేళ్లుగా ఫుల్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతోన్న సమయంలో అతడి పొలిటికల్ ఎంట్రీ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసం!

డబుల్ హ్యాట్రిక్‌కు చేరువైన జూనియర్ ఎన్టీఆర్

డబుల్ హ్యాట్రిక్‌కు చేరువైన జూనియర్ ఎన్టీఆర్


చాలా కాలం పాటు జూనియర్ ఎన్టీఆర్ వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి సమయంలో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ హిట్లను అందుకున్నాడు. తద్వారా డబుల్ హ్యాట్రిక్ చేరువయ్యాడీ నందమూరి హీరో.

సినీ చరిత్రలోనే ప్రత్యేకమైన చిత్రంలో భాగంగా

సినీ చరిత్రలోనే ప్రత్యేకమైన చిత్రంలో భాగంగా

'బాహుబలి' వంటి సూపర్ హిట్ సిరీస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తోన్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. ఇందులో తారక్.. కొమరం భీంగానూ, చరణ్.. అల్లూరి గానూ నటిస్తున్నారు.

అవన్నీ లైన్‌లో పెట్టుకున్న నందమూరి హీరో

అవన్నీ లైన్‌లో పెట్టుకున్న నందమూరి హీరో

RRR పట్టాలపై ఉండగానే.. జూనియర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే పేరు పరిశీలనలో ఉన్న ఈ సినిమాను కల్యాణ్ రామ్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయనున్నాడు తారక్. ఆ తర్వాత అట్లీ, కొరటాల సహా కొన్ని తెరపైకి వస్తున్నాయి.

రీఎంట్రీ ఇవ్వబోతున్న ఎన్టీఆర్.. కోటీశ్వరులను

రీఎంట్రీ ఇవ్వబోతున్న ఎన్టీఆర్.. కోటీశ్వరులను

గతంలో బిగ్ బాస్ షో ద్వారా హోస్టుగా అలరించిన జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు మరోసారి బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గతంలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో వచ్చి సూపర్ సక్సెస్ అయిన షోను.. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు' పేరిట తీసుకొస్తున్నారు. జెమినీ టీవీలో ప్రసారం కానున్న దీనినే తారక్ హోస్ట్ చేయనున్నాడు. తాజాగా ఈ ప్రోమో కూడా విడుదలైంది.

పొలిటికల్ ఎంట్రీపై షాకింగ్‌గా రియాక్ట్ అయ్యాడు

పొలిటికల్ ఎంట్రీపై షాకింగ్‌గా రియాక్ట్ అయ్యాడు

'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు గానూ.. తాజాగా నిర్వహకులు ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్టు పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు తారక్. 'ఇప్పుడు సమయం.. సందర్భం కాదు. ఓ రోజు కాఫీ తాగుతూ మనమే కబుర్లు చెప్పుకుందాం' అంటూ ఊహించని విధంగా స్పందించాడతను.

ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ చేసిన కామెంట్లతో అతడి పొలిటికల్ ఎంట్రీ గురించి కొన్ని రోజుల పాటు పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. దీంతో ఎన్నో ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఆవిర్భావం దినోత్సవం రోజు ఎన్టీఆర్ పార్టీలోకి వస్తున్నట్లు చెప్పి అందరికీ షాకిచ్చారాయన.

మొదలైన సందేహాలు.. ఫ్యాన్స్‌లో అయోమయం

మొదలైన సందేహాలు.. ఫ్యాన్స్‌లో అయోమయం

గోరంట్ల మాట్లాడుతూ.. 'పార్టీకి దూరంగా ఉన్న ఎన్టీఆర్ సహా చాలా మంది నాయకులు త్వరలోనే పాలిటిక్స్‌లోకి వస్తారు. టీడీపీకి కూడా కొత్త నాయకత్వం వస్తుంది' అని ఆయన చెప్పారు. దీంతో ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్‌పై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన వ్యాఖ్యలతో అందరిలోనూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఫ్యాన్స్‌లో అయోమయం కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X