Don't Miss!
- News పోటీ నుంచి తప్పుకున్న శ్రీరాములు భార్య, రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి, వార్ వన్ సైడ్ కాదు, పోటీ !
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
ఐశ్వర్యరాయ్ థ్రిల్, కాన్స్ ఫిల్మ్ఫెస్ట్లో మోడీపై కామెంట్స్
లాస్ ఏంజిల్స్: ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ తన స్టన్నింగ్ లుక్‌తో చూపరుల మతిపోగొడుతోంది. ఈ నీలి కళ్ల సుందరి ఈ కాన్స్ ఫెస్టివల్లో ప్రస్తుత పొలిటికల్ హీరో నరేంద్ర మోడీపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది.
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కేవలం అందాలు ప్రదర్శించడమే కాదు...భారత దేశానికి ప్రధాని కాబోతున్న నరేంద్ర మోడిపై ప్రశంసల వర్షం కురిపించింది. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత దేశం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని, భారత దేశం స్థితి మారుతుందని భావిస్తున్నట్లు ఐశ్వర్యరాయ్ చెప్పుకొచ్చారు.
'మా దేశానికి నెక్ట్స్ ప్రైమ్ మినిస్టర్‌గా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టబోతుండటం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. మోడీ నాయకత్వంలో భారత దేశం అభివృద్ధి విషయంలో గతంలో కంటే మరింత వేగవంతంగా ముందుకు సాగుతుందనే నమ్మకం ఉంది' అంటూ ఐశ్వర్యరాయ్ తన మనసులోని మాట బయట పెట్టారు.
ఐశ్వర్యరాయ్‌తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ప్రీతీ జింతా, సోహా అలీ ఖాన్, వివేక్ ఒబెరాయ్ తదితరులు మోడీ విజయం సాధించడంపై ఓపెన్‌గా స్పందించారు. మోడీ దేశానికి ప్రధాని అవుతుండటం శుభ సూచకమని పేర్కొన్నారు. తాజాగా ఐశ్వర్యరాయ్ ఏకంగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రపంచం మొత్తానికి తెలిసేలా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.