క్లబ్బులో నమిత, అందరి చూపులు అందాలపైనే..(ఫోటోలు)
హైదరాబాద్: సినిమాల్లో బిజీగా లేక పోయనా... ఈ మధ్య తరచూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది అందాల బొద్దుగుమ్మ నమిత. తాజాగా నమిత నిన్న ఓ క్లబ్బు ఓపెనింగుకు హాట్ హాట్ గా పొట్టి డ్రెస్సులో హాజరై అందరి చూపులు తన అందాలపై చేసుకుంది. చెన్నైలో ఈ క్లబ్ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది.
చెన్నై ప్లాస్టిక్ సర్జరీ వారు కొత్తగా ఏర్పాటు చేసిన 'బ్యూటీ క్లబ్' ప్రారంభ కార్యక్రమంలో నమిత తో పాటు, డాక్టర్ కార్తీక్ రామ్ తదితరులు పాల్గొన్నారు. నమిత ఈకార్యక్రమానికి సెక్సీ బ్లాక్ డ్రెస్ లో హాజరై మీడియాతో పాటు అందరి దృష్టిని ఆకర్షించింది. కెమెరా ముందు హాట్ హాట్ గా ఫోజులు ఇస్తూ క్లబ్ కు సంబంధించిన వివరాలు వెల్లడించింది.
ఈ క్లబ్ ఏర్పాటు లక్ష్యం గురించి నమిత మాట్లాడుతూ... మహిళలు అంతా ఒక చోట కలిసి అందం పెంచుకోవడం పట్ల తమ నాలెడ్జ్ ని షేర్ చేసుకోవడం అనే ఉద్దేశ్యంతో ఈ క్లబ్ ప్రారంభించారని, సినిమా, మెడికల్ రంగాలతో పాటు వివిధ రంగాలకు చెందిన వారి కోసం ఈ క్లబ్ ఏర్పాటు చేసినట్లు నమిత చెప్పుకొచ్చారు. మరింత అందంగా కనిపించడానికి గల టెక్నిక్స్, అందమైన చర్మానికి చిట్కాలు, బరువు తగ్గించుకోవడం, బరుపు పెరగడం, కేశ సంరక్షణ తదితర అంశాలకు సంబంధించి అంశాలపై ఈ క్లబ్ పని చేస్తుందన్నారు. మిగతా వివరాలు స్లైడ్ షోలో...

ఈ బ్యూటీ క్లబ్ లో తాను కూడా మెంబర్ గా చేరనున్నట్లు నమిత వెల్లడించింది.

తన సినిమా గురించి నమిత మాట్లాడుతూ ఇటీవల ఇతర భాషల చిత్రాల్లో నటిస్తూ బిజిగా ఉన్నానని, త్వరలో మాచన్ అనే తమిళ సినిమాతో నటిస్తున్నట్లు వెల్లడించారు.

మాచన్ సినిమాలో నమిత రమేష్ అరవింద్, వివేక్, కరుణాస్ లతో స్క్రీన్ పంచుకోనుంది. ఈ చిత్రానికి శక్తి చిదంబరం దర్శకత్వం వహిస్తారు.

మాచన్ సినిమాలో నమిత రమేష్ అరవింద్, వివేక్, కరుణాస్ లతో స్క్రీన్ పంచుకోనుంది. ఈ చిత్రానికి శక్తి చిదంబరం దర్శకత్వం వహిస్తారు.

ఆమె కన్నడ-తెలుగులో నటించిన ‘నమిత ఐలవ్ యు' చిత్రం తమిళంలో అనువాదం అవుతోంది.


Click it and Unblock the Notifications











