గాసిప్స్ ఫ్రీ పబ్లిసిటీ తెచ్చినా అంతొద్దంటున్న అనుష్క
గాసిప్స్ ఫ్రీ పబ్లిసిటీ తెచ్చి పెడతాయని అయితే అంతమాత్రాన మరీ అసభ్యకరంగా ఉంటే మాత్రం క్షమించేది లేదని బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ అంటోంది. తనపై వస్తోన్న ఎఫైర్ వార్తలన్ని ఎంజాయ్ చేస్తానని, ఎఫైర్స్ వల్ల వచ్చే గాసిప్స్‌ను ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకుంటే బాధపడాల్సిన అవసరం లేదని చెబుతోంది. చాలామంది హీరోలతో తనకు ఎఫైర్ ఉందని అంటగట్టారని దానిని తానేమీ సీరియస్‌గా తీసుకోనని చెబుతోంది. అంతేకాదండోయ్ సదరు హీరోతో ఈ గాసిప్స్ గురించి చెప్పుకొని నవ్వుకుంటుందట.
మొదట్లో సీరియస్‌గా తీసుకున్నప్పటికీ ఆ తర్వాత అలవాటైపోయిందంటోందీ అమ్మడు. సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడే వీటిని పేస్ చేయాలని మదిలో ఉంచుకోవాలని సూచిస్తోంది. గాసిప్స్ ఫ్రీ పబ్లిసిటీ తెస్తాయని అవి ఫన్నీంగా ఉంటే ఫర్లేదని చెబుతూనే శృతిమించేతే మాత్రం ఊరుకునేది లేదంటోంది. కాగా ఈ ముద్దుగుమ్మ షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన రబ్ నె బనా ది జోడితో హీరోయిన్‌గా బాలీవుడ్ తెరంగేట్రం చేశారు.


Click it and Unblock the Notifications











