ఆ హీరోతో జ్వాలా గుత్తా ప్రేమాయణమా? పబ్లిసిటీ స్టంటా?
హైదరాబాద్ : బాట్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ హీరోగా రూపొందిన ఈచిత్రంలో ఆమె ఐటం సాంగు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోంది. పబ్లిసిటీని ఎక్కువగా ఇష్టపడే జ్వాలా తనదైన హాట్ లుక్‌తో సినిమాల్లోకి రాక ముందు నుంచే గుర్తింపు తెచ్చుకుంది.
చివరి దశలో ఉన్న తన బ్యాట్మింటన్ కెరీర్‌కు ప్రయత్యామ్నాయంగానే ఆమె సినిమా రంగాన్ని ఎంచుకుందనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి. మరి రంగుల ప్రపంచంలో నిలదొక్కుకోవడం అంటే ఆషామాషీ కాదు. క్రీడారంగంలో మాదిరి కేవలం టాలెంట్ మాత్రమే ఉంటే చాలదు. సినిమా రంగంలో నిలదొక్కుకోవాలంటే 'పబ్లిసిటీ' సంపాదించడం అనేది చాలా ముఖ్యం.
తాజాగా జ్వాలా గుత్తా కూడా ఇదే సూత్రం ఫాలో అవుతున్నట్లుంది. టాలీవుడ్ హీరో హర్షవర్ధన్ రాణె(తకిట తకిట ఫేం)తో కొన్ని రోజులుగా జ్వాలా చాలా క్లోజ్ గా మూవ్ అవుతోంది. ఎక్కడికెళ్లినా ఇద్దరు జంటగా వెలుతున్నారు. దీంతో ఫిల్మ్ నగర్లో వీరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు గుప్పుమన్నాయి.
భర్తతో విడిపోయాక ఒంటరిగా ఉంటున్న జ్వాలా తోడు వెతుక్కుందని కొందరంటుంటే, పబ్లిసిటీ కోసం ఆర్టిఫిషియల్ ఎఫైర్ కొనసాగిస్తున్నారని మరికొందరంటున్నారు. మరి వీరి మధ్య ఉన్నది కేవలం స్నేహ బంధమేనా? మరి ఇంకేమైనా 'సం'బంధమా? అనేది వారిలో ఎవరో ఒకరు నోరు విప్పితే కానీ తెలీదు.


Click it and Unblock the Notifications












