వివాదంలో ‘గౌరవం’, నిషేధించాలని డిమాండ్!
చెన్నై: అల్లు శిరీష్‌ను హీరోగా పరిచయం చేస్తూ ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్న 'గౌరవం' చిత్రం వివాదంలో ఇరుక్కుంది. ఈ చిత్రంలో తమిళనాడుకు చెందిన గౌండర్ కమ్యూనిటీని కించ పరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని ఆందోళన మొదలైంది. ఈ మేరకు ఆ కమ్యూనిటీకి చెందిన నాయకులు తమిళనాడు పభుత్వానికి ఫిర్యాదు చేసారు. సినిమాను నిషేదించాలని డిమాండ్ చేస్తున్నారు.
దీంతో విశ్వరూపం చిత్రాన్ని నిషేదించినట్లుగా ఈ చిత్రాన్ని కూడా తమిళనాడులో నిషేదిస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ బేనర్‌పై రాధామోహన్ దర్శకత్వంలో 'గౌరవం' చిత్రాన్ని ప్రకాష్ రాజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 19న విడుదలకు సిద్ధమవుతోంది.
'గౌరవం' సినిమా ఆడియో శుక్రవారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైసెర్స్ హైదరాబాద్ కి పూణే వారియర్స్ కి మధ్య జగిన ఐ.పీ.ఎల్ మ్యాచ్ సందర్భాన్ని పురస్కరించుకుని విడుదల చేసారు. ఆడియో రిలీజ్ కార్యక్రమంలో హీరో హీరోయిన్లతో పాటు ప్రకాష్ రాజ్, నాగబాబు, అల్లు అరవింద్, చంద్రబోస్, థమన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శిరీష్, యామిగౌతం సినిమాలోని పాటలకు స్టెప్పేలేసి స్టేడియానికి వచ్చిన క్రికెట్ అభిమానులను అలరించారు. అదే విధంగా గీతామాధురి బృందం ఆలకించిన పాటలు శ్రోతలను మెప్పించాయి.
ఈ చిత్రం సోషల్ డ్రామా... హ్యూమన్ టచ్ తో కూడి ఉంటుంది. ఓ సిటీ కుర్రాడు... తన స్నేహితుడుని వెతుక్కుంటూ ఓ విలేజ్ కు వెళ్లతాడు. అక్కడ జరిగే పరిణామాల సమాహారమే గౌరవం చిత్రం. అల్లు శిరీష్, యామి గౌతం హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్ంరలో ప్రకాశ్‌రాజ్, నాజర్, పవిత్రా లోకేష్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రీత, కళ: కదీర్.


Click it and Unblock the Notifications












