గౌరవం : ఎన్నారైల కోసం ప్రకాష్‌రాజ్ ఆఫర్
హైదరాబాద్ : అల్లు శిరీష్‌ను హీరోగా పరిచయం చేస్తూ ప్రకాష్ రాజ్ నిర్మించిన 'గౌరవం' చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే పెట్టిన పెట్టుబడిలో వీలైనంత వరకు రాబట్టుకునేందుకు ప్రకాష్ రాజ్ వివిధ మార్గాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టారు.
విదేశాల్లో స్థిర పడ్డ ఎన్నారైల కోసం ప్రకాష్ తాజాగా సరికొత్త ఆఫర్ ప్రకటించారు. గౌరవం సినిమాను కేవలం 5 అమెరికన్ డాలర్లకే ఆన్‌లైన్లో లీగల్‌గా హెచ్‌డి క్వాలిటీలో ఆన్‌లైన్లో చూసే అవకాశం కల్పిస్తున్నాడు. ఈ అవకాశం భారత్, అమెరికాలో ఉంటున్న వారికి తప్ప అన్ని దేశాల్లో ఉండే వారికి వస్తుంది.
ఈ సినిమాను ఆన్ లైన్లో చూసే వారికి మరో బోనస్ కూడా ఇవ్వాలని నిర్ణయించారు. 5 యూఎస్ డాలర్లు చెల్లించి 'గౌరవం' సినిమా చూస్తే 'ధోని' సినిమాను ఫ్రీగా చూపిస్తారట. అయితే మే 1 లోపు మాత్రం ఈ అవకాశం. డబ్బులు చెల్లించాక ఇంటర్నెట్ కనెక్షన్ సమస్యల వల్ల మీరు 'గౌరవం' సినిమా చూడలేక పోతే మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తామని గ్యారంటీ ఇస్తున్నారు ప్రకాష్ రాజ్. పూర్తి వివరాల కోసం http://prakashrajlive.com వెబ్ సైట్ ను సంప్రదించండి.
అల్లు శిరీష్‌ను హీరోగా పరిచయం చేస్తూ ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ బేనర్‌పై రాధామోహన్ దర్శకత్వంలో నిర్మాత ప్రకాష్ రాజ్ 'గౌరవం' చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కించారు. కుల వ్యవస్థ, దానివల్ల జరిగే గొడవల మీద తెరకెక్కిన ఈ సినిమాలో యామి గౌతం హీరోయిన్ గా నటించింది.


Click it and Unblock the Notifications











