‘గౌరవం’ సెన్సార్ రిపోర్ట్
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు మెగా కుటుంబం నుంచి మరో హీరో పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు శిరీష్‌ను హీరోగా పరిచయం చేస్తూ ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ బేనర్‌పై రాధామోహన్ దర్శకత్వంలో నిర్మాత ప్రకాష్ రాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'గౌరవం'. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ 'U' సర్టిఫికెట్ పొందింది. రేపు (ఏప్రిల్ 19)న ఈచిత్రం గ్రాండ్ గా రిలీజవుతోంది.
కుల వ్యవస్థ, దానివల్ల జరిగే గొడవల మీద తెరకెక్కిన ఈ సినిమాలో యామి గౌతం హీరోయిన్ గా నటించింది. రాధా మోహన్ ఇప్పటికే విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. తన తొలి సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని అల్లు శిరీష్ ఎంతో నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమా కంటెంట్ ని, థీం లైన్ విని మెగాస్టార్ చిరంజీవి కూడా మెచ్చుకున్నారు.
నిర్మాత ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. 'గగనం, ఆకాశమంత వంటి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలకు దర్శకత్వ వహించిన రాధామోహన్ దర్శకత్వంలో అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం గౌరవం. విక్కీ డోనర్ వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించిన యామీ గౌతమ్ అల్లు శిరీష్‌తో జోడీ కట్టింది. ఈ సినిమా సామాజిక స్పృహ కలిగిన మంచి కథాంశంతో రూపొందుతోంది. దర్శకుడు రాధా మోహన్ తను చెప్పాలనుకున్న పాయింట్ ను తెరమీద అద్భుతంగా ఆవిష్కరించారని' తెలిపారు.
రాధామోహన్ మాట్లాడుతూ...ఒక మంచి కథకి, మంచి నటీనటులు సమకూరితే ఆ చిత్రం ఎలా ఉంటుందో మా గౌరవం కూడా అదే రేంజిలో ఉండబోతోంది. ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే హైలెట్‌గా నిలవబోతోంది. మేము ఎంచుకున్న కాన్సెప్ట్ గౌరవం చిత్రానికి బాగా ప్లస్సవుతుంది. అల్లు శిరీష్, యామి గౌతమ్, ప్రకాష్ రాజ్, నాజర్ వారి పాత్రల్లో ఇమిడిపోయారు. తమన్ సంగీతం వైవిద్యంగా ఉండబోతోంది. సినిమాటోగ్రఫీ మరో హైలెట్.


Click it and Unblock the Notifications











