ఐపీఎల్ మ్యాచ్‌లో ‘గౌరవం’ ఆడియో రిలీజ్...(ఫోటోలతో)
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు మెగా కుటుంబం నుంచి మరో హీరో పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు శిరీష్‌ను హీరోగా పరిచయం చేస్తూ ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ బేనర్‌పై రాధామోహన్ దర్శకత్వంలో నిర్మాత ప్రకాష్ రాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'గౌరవం'.
అల్లు శిరీష్, యామి గౌతం జంటగా నటిస్తున్న 'గౌరవం' సినిమా ఆడియో శుక్రవారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైసెర్స్ హైదరాబాద్ కి పూణే వారియర్స్ కి మధ్య జరుగుతున్న ఐ.పీ.ఎల్ మ్యాచ్ సందర్భాన్ని పురస్కరించుకుని విడుదల చేసారు. ఈ సినిమా ఏప్రిల్ 19 న విడుదల కాబోతుంది.
ఆడియో రిలీజ్ కార్యక్రమంలో హీరో హీరోయిన్లతో పాటు ప్రకాష్ రాజ్, నాగబాబు, అల్లు అరవింద్, చంద్రబోస్, థమన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శిరీష్, యామిగౌతం సినిమాలోని పాటలకు స్టెప్పేలేసి స్టేడియానికి వచ్చిన క్రికెట్ అభిమానులను అలరించారు. అదే విధంగా గీతామాధురి బృందం ఆలకించిన పాటలు శ్రోతలను మెప్పించాయి.

గౌరవం ఆడియో రిలీజ్ చేస్తున్న దృశ్యం.

ఆడియో వేడుకలో హీరో హీరోయిన్ల స్టెప్పులు.

అల్లు శిరీష్-యామి గౌతం.

ప్రకాష్ రాజ్.

పాటలు పాడుతున్న గీతా మాధురి బృందం.

యామి గౌతమి.

స్టేడియంలో ప్రేక్షకుల సందడి.


Click it and Unblock the Notifications











