ఏప్రిల్ మొదటి వారంలో గౌరవం, హైలెట్స్‌పై ప్రకాష్ రాజ్
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు మెగా కుటుంబం నుంచి మరో హీరో పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు శిరీష్‌ను హీరోగా పరిచయం చేస్తూ ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ బేనర్‌పై రాధామోహన్ దర్శకత్వంలో నిర్మాత ప్రకాష్ రాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'గౌరవం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ మొదటి వారంలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. 'గగనం, ఆకాశమంత వంటి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలకు దర్శకత్వ వహించిన రాధామోహన్ దర్శకత్వంలో అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం గౌరవం. విక్కీ డోనర్ వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించిన యామీ గౌతమ్ అల్లు శిరీష్‌తో జోడీ కట్టింది. ఈ సినిమా సామాజిక స్పృహ కలిగిన మంచి కథాంశంతో రూపొందుతోంది. దర్శకుడు రాధా మోహన్ తను చెప్పాలనుకున్న పాయింట్ ను తెరమీద అద్భుతంగా ఆవిష్కరించారని' తెలిపారు.

ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్న అల్లు శిరీష్ భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు.

తమన్ సూపర్ మ్యూజిక్ అందించారు. నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ కానుంది.

ఏప్రిల్ ప్రథమార్థంలో గౌరవం సినిమా విడుదల కాబోతోంది.

గౌరవం చిత్రంలో అల్లు శిరీష్.
దర్శకుడు రాధామోహన్ మాట్లాడుతూ...ఒక మంచి కథకి, మంచి నటీనటులు సమకూరితే ఆ చిత్రం ఎలా ఉంటుందో మా గౌరవం కూడా అదే రేంజిలో ఉండబోతోంది. ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే హైలెట్‌గా నిలవబోతోంది. మేము ఎంచుకున్న కాన్సెప్ట్ గౌరవం చిత్రానికి బాగా ప్లస్సవుతుంది. అల్లు శిరీష్, యామి గౌతమ్, ప్రకాష్ రాజ్, నాజర్ వారి పాత్రల్లో ఇమిడిపోయారు. తమన్ సంగీతం వైవిద్యంగా ఉండబోతోంది. సినిమాటోగ్రఫీ మరో హైలెట్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.


Click it and Unblock the Notifications











