twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా ఎఫెక్ట్: థియేటర్స్ మూసేయండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

    |

    ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది కరోనా వైరస్. చైనా దేశం వూహాన్ నగరంలో పుట్టిన ఈ మహమ్మారి ఆ దేశ సరిహద్దులు దాటి ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపుతోంది. చాలా దేశాల్లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో నివారణ చర్యల్లో భాగంగా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఇందులో భాగంగానే థియేటర్స్ మూసేయండని ఆర్డర్స్ వేసింది గవర్నమెంట్. వివరాల్లోకి పోతే..

     భారతదేశంలో కరోనా కేసులు.. అప్రమత్తమైన ప్రభుత్వం

    భారతదేశంలో కరోనా కేసులు.. అప్రమత్తమైన ప్రభుత్వం

    ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని బలి తీసుకున్న కరోనా వైరస్.. భారత భూభాగాన్ని కూడా తాకింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఒక్క కేరళ లోనే 12 కేసులు నమోదయ్యాయి. దీంతో వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేసిన కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

    థియేటర్స్ క్లోజ్.. ప్రభుత్వ ఆదేశాలు

    థియేటర్స్ క్లోజ్.. ప్రభుత్వ ఆదేశాలు

    జనం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో కరోనా ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నాయి. చేతులు కలపడం, దగ్గడం, తుమ్మడం ద్వారా కరోనా ఒకరినుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జనం ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలపై ఆంక్షలు విధించింది కేరళ గవర్నమెంట్. ఇందులో భాగంగా థియేటర్స్ క్లోజ్ చేయాలని ఆదేశించింది.

    ముఖ్యమంత్రి ఆర్డర్స్.. విద్యా సంస్థలకు కూడా!

    ముఖ్యమంత్రి ఆర్డర్స్.. విద్యా సంస్థలకు కూడా!

    రక్షణ చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలనే కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేరళలో మార్చి 31 వరకు రాష్ట్రంలో సినిమా థియేటర్లు మూసివేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా విద్యా సంస్థలకు కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

    Recommended Video

    Vishwaksen Hungama At Sandhya 70mm | Hit Movie Public Talk | Filmibeat Telugu
    సినిమాలపై ఎఫెక్ట్.. విడుదల వాయిదా

    సినిమాలపై ఎఫెక్ట్.. విడుదల వాయిదా

    ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మార్చి నెలలో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడాల్సిన పరిస్థితి నెలకొంది. వాయిదా పడే సినిమాల్లో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ భారీ చిత్రం 'మరక్కార్' కూడా ఉంది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 26న విడుదల కావాల్సి ఉండగా దాన్ని వాయిదా వేయక తప్పడం లేదట.

    English summary
    In Kerala state theaters could remain closed through the end of March as the government works to contain the virus, Deadline reported.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X