హనుమాన్ సినిమాపై గవర్నర్ తమిళ్ సై రివ్యూ.. హీరోను పిలిపించుకుని మరీ అలా చెప్పింది!

యంగ్ అండ్ డైనమిక్ హీరో తేజా సజ్జా కథానాయకుడిగా.. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా హనుమాన్. ఈ చిత్రంలో సజ్జా సరసన అమృతా అయ్యర్ నటించి మెప్పించింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా జనవరి 12 తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. ఎవరూ ఊహించని స్థాయిలో హిట్టు కొట్టిని ఈ సినిమాపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. మూవీకి ఎక్స్ వేధికగా రీవ్యూ కూడా ఇచ్చారు. అంతేనా చిత్రబృందాన్ని కూడా తన ఆఫీస్ కు పిలిపించుకున్నారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.

ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో తేజా సజ్జాతో పాటు వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీనులు కూడా ఈ సినిమాలో నటించారు. విజ్యువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ లు సంగీతం అందించారు. జనవరి 12వ తేదీన తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేశారు.

Governor Tamili Sai Soundera Rajan Appreiciate Hanuman Movie Team Check Details

విజ్యువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ముందుగా 2500 స్క్రీన్లతో ఈ సినిమా ప్రదర్శింపబడగా... వారం కాగానే 4500 నుంచి 5000 థియేటర్లకు చేరుకుంది. సినిమా బాగుండడం.. టికెట్లు దొరక్కపోవడంతో ఈ రేంజ్ లో థియేటర్లను పెంచారు. ఇప్పటికే 220 కోట్ల కలెక్షన్లను రాబట్టుకుని సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాకు తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళి సౌ సౌందర రాజన్ రీవ్యూ ఇచ్చారు. సినిమా చాలా బాగుందని చెప్పారు. ముఖ్యంగా హీరో తేజా సజ్జాతో పాటు ప్రొడ్యూసర్ ను తన ఆఫీసుకు పిలిపించుకుని మరీ ప్రశంసించారు.

శాలువా కప్పి మరీ అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా హనుమాన్ సినిమా అద్భుతమైన విజయం సాధించినందుకు చిత్ర బృందానికి అభినందనలు అన్నారు. ఆకట్టుకునే విజ్యువల్స్.. అదిరిపోయే వీఎఫ్ఎఎక్స్ ను చూపించడంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సక్సెస్ అయ్యారని గవర్నర్ తమిళిసై చెప్పుకొచ్చారు. అలాగే హీరో తేజా సజ్జా స్వచ్ఛమైన దృఢ విశ్వాసం, అసాధారణ నైపుణ్యాలతో కూడిన పాత్రలో రాణించారని చెప్పారు. ఆల్ రౌండ్ ఎంటర్‌టైనర్ గా నిలిచిన ఈ సినిమా అందరికీ గుర్తిండిపోతుందని స్పష్టం చేశారు.

Governor Tamili Sai Soundera Rajan Appreiciate Hanuman Movie Team Check Details

అలాగే హీరో తేజా సజ్జాతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరిన్ని గొప్ప సినిమాలు తీస్తూ.. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తనకు కూడా హనుమాన్ సినిమా చాలా బాగా నచ్చిందని హీరో, ప్రొడ్యూసర్ లతో చెప్పినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X