పెద్ద బ్యానర్ లో ...విలన్ పాత్రకి స్టార్ కామెడీ హీరో ఖరారు
ముంబై : బాలీవుడ్ స్టార్ కామెడీ హీరో గోవిందా త్వరలో విలన్ గా అలరించనున్నారు. ఇన్నాళ్లూ వెండితెరపై నవ్వులు పండించిన గోవిందా తన విలనిజంతో అదరకొడతానంటున్నాడు. ఆయన రాజకీయాల్లోకి రాక ముందు వరుసగా వినోదాత్మక చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరించారు. గత కొంత కాలంగా నటనకు దూరంగా ఉన్నారు. త్వరలో గోవిందా విలన్ గా కెమెరా ముందుకు రాబోతున్నారు.
యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించే 'కిల్ దిల్'లో ఆయన విలన్‌గా నటించబోతున్నారు. షాద్‌అలీ దర్శకుడు. ఈ విషయమై దర్శకుడు మాట్లాడుతూ... ''ఈ చిత్రంలో గోవిందా కీలక పాత్రధారి. తన సినీ జీవితంలో ఇంతవరకు పోషించని విలన్ పాత్రను చేస్తున్నారు. గతంలో 'షికారీ'లో ఆ ఛాయలున్న పాత్ర చేసినప్పటికీ ఇది ప్రత్యేకం'' అన్నారు.
గోవిందా మాట్లాడుతూ...''నేను చిత్ర పరిశ్రమలో ప్రవేశించి వచ్చే ఏడాదికి 30 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ తరుణంలో ఇలాంటి వైవిధ్యమైన పాత్రను పోషించడం గొప్ప అనుభూతినిస్తోంది''అన్నారు. గోవిందా అభిమానులు సైతం తమ హీరో ఎలా నెగిటివ్ టచ్ తో పాత్రను పండిస్తాడో అని చూడాలని చాలా ఆత్రుతగా ఉన్నారు.


Click it and Unblock the Notifications












